బాలీవుడ్ స్టార్ల కన్నా మన దక్షిణాది హీరోల సంపాదనే ఎక్కువ.. టాప్ 5 ఎవరెవరు? ఎంతంటే?

  • Publish Date - October 16, 2020 / 09:49 PM IST

South Indian celebs vs Bollywood stars : 2020లో దక్షిణ భారత ప్రముఖుల స్టార్‌డమ్ గురించి తెలుసా? దక్షిణ భారత నటులలో కొందరు బాలీవుడ్ హీరోల కంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు.  పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలపై కూడా దక్షిణాది హీరోలే సత్తా చాటుతున్నారు.

ఫోర్బ్స్ 2019 సెలబ్రిటీ 100 జాబితాలో బాలీవుడ్ స్టార్లను మించిపోయారు మన దక్షిణాది హీరోలు.. బాలీవుడ్ హీరోల కంటే మన దక్షిణాది హీరోలే బాగా సంపాదిస్తున్నారు. ఇంతకీ దక్షిణాది హీరోల్లో ఐదుగురు ప్రముఖ హీరోలు ఎంత సంపాదిస్తున్నారు..? వారు ఎవరో తెలుసుకుందాం రండి..

1. Rajinikanth vs Aamir Khan :

రజనీకాంత్ : రూ. 100 కోట్లు (2019లో)
అమీర్ ఖాన్ : రూ. 85 కోట్లు

ప్రముఖ దక్షిణాది హీరో రజనీకాంత్.. దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ హీరోల్లో ఒకరే కాదు.. భారతదేశంలో దక్షిణ భారత సెలబ్రిటీల్లో అత్యధిక సంపాదనతో రజనీ టాప్ ర్యాంకులో ఉన్నాడు. ఆయన తనదైన స్టయిల్, మేనరిజంతో నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. నటుడిగా కంటే ఆయన్ను దేవుడు లేదా సూపర్ హీరోగా భావిస్తుంటారు. 2019లో రజనీ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.O మూవీతో 100 కోట్లు సంపాదించాడు.
ఈ మూవీతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడిగా పెట్టా మూవీల 500 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు ఫోర్భ్స్ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఒక మూవీ కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ అమిర్ ఖాన్ రూ.85 కోట్ల సంపాదనతో రజనీ తర్వాతి స్థానంలో నిలిచాడు. చివరిసారిగా Thugs of Hindustan మూవీలో అమిర్ ఖాన్ కనిపించాడు. ఈ మూవీ ఫ్లాప్ టాక్ అందుకుంది. అమిర్ నటిస్తున్న మరో కొత్త మూవీ Lal Singh Chadha ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

2. Mohanlal vs Hrithik Roshan :

మోహన్ లాల్ : రూ. 64.5 కోట్లు
హృతిక్ రోషన్ : రూ.58.73 కోట్లు

మలయాళం సినీ పరిశ్రమలో మోహన్ లాల్ పాపులర్ హీరో.. గత ఏడాదిలో ఐదు మూవీలకు పద్మ భూషణ్ అవార్డును గెల్చుకున్నారు. Lucifer మూవీతో మోహన్ లాల్ అతిపెద్ద సక్సెస్ అందుకుని తన సంపాదన పెంచుకున్నాడు. మోహన్ లాల్ 64.5 కోట్లు సంపాదించాడు. 2020లో జనవరిలో వచ్చిన ‘బిగ్ బ్రదర్’ మూవీ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కు 2019 బాగా అచ్చొచ్చింది.. మంచి సక్సెస్ ను ఎంజాయ్ చేశాడు. 2020 ఏడాదిలో వచ్చిన War మూవీతో కూడా అత్యధిక సంపాదనతో టాప్ సెకండ్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ మూవీకి హృతిక్ రూ. 48 కోట్లు తీసుకున్నాడు. మరో మూవీ ‘సూపర్ 30’తో కూడా 100 కోట్ల క్లబ్ కేటగిరీలో చేరిపోయాడు హృతిక్ రోషన్.. మొత్తంగా హృతిక్ రూ. 58.73 కోట్లు సంపాదించాడు.

3. Prabhas vs Ayushmann Khurrana :

ప్రభాష్ : రూ. 50 కోట్లు
ఆయూష్మాన్ ఖుర్రానా : రూ. 30.5 కోట్లు

ఫోర్భ్స్ 2019లో 100 సెలబ్రెటీల సంపన్నుల జాబితాలో యంగ్ సౌత్ ఇండియన్ సెలబ్రెటీల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ రూ. 50కోట్లతో టాప్ 3 ర్యాంకులో నిలిచాడు.  ప్రభాష్ నటించిన 2019 ద్విభాషా చిత్రం Saahoతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ రూ.130 కోట్లతో భారతీయ చిత్రాల్లో రెండో అత్యధిక ఓపెనింగ్‌డే కలెక్షన్ల ర్యాంకులో నిలిచింది. విమర్శలు ఉన్నప్పటికీ, సాహో 2019లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. 2018, 2020లో ఒక్క మూవీ కూడా లేదు. అయినా ప్రభాస్ కేవలం ఒక ఫ్లాప్ మూవీ ఆధారంగా బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ కంటే ఎక్కువ సంపాదించాడు.

బాలీవుడ్ హీరో Ayushmann Khurrana కూడా 2018 నుంచి తన మూవీల్లో సక్సెస్ అందుకుంటూనే ఉన్నాడు. 2019లో వచ్చిన Dream Girl Bala మూవీలు రెండు మంచి హిట్ టాక్ అందుకున్నాయి. 2020లో Shubh Mangal Zyaada Savdhaan మూవీతో Khurrana సక్సెస్ ట్రాక్ గ్రాఫ్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. Khurrana సంపాదన రూ.30.5 కోట్లకు చేరింది.

4. Vijay vs Shahid Kapoor :

విజయ్ : రూ. 30 కోట్లు
షాహిద్ కపూర్ : 12.75 కోట్లు

విజయ్.. దళపతిగా అందరికి సుపరిచితం.. దేశంలో అతిపెద్ద దక్షిణ భారతీయ సెలబ్రెటీల్లో ఒకడు.. 2019 తర్వాత విజయ్ నటించిన మూవీ Bigil.. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టింది. స్టార్ సూపర్ డమ్ కలిగిన విజయ్.. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా మారేందుకు నెమ్మదిగా రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్నాడు విజయ్.

మరోవైపు.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ 2019లో నటించిన Kabir Singh, Padmaavat మూవీలు రెండు మంచి హిట్ టాక్ అందుకున్నాయి. 2019 భారతీయ సినిమాల్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన కబీర్ సింగ్.. మూడో అత్యధిక చిత్రంగా నిలిచింది. వార్, సాహో మూవీల తర్వాత షాహిద్ కబీర్ సింగ్ అత్యధికంగా వసూళ్లు రాబట్టింది.

5. Mahesh Babu vs Saif Ali Khan :

మహేష్ బాబు : రూ. 35 కోట్లు
సైఫ్ అలీ ఖాన్ : రూ.17.03 కోట్లు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2019లో ‘మహర్షి’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీతో రూ. 35కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకేవరు మూవీతో సంపాదనను లెక్కించలేదు. ఈ మూవీ అన్నింటికంటే రూ. 260 కోట్లు వసూలు చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో రెండవ చిత్రంగా నిలిచింది.
బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ స్కేర్డ్ గేమ్స్‌తో డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. Udaybhan Singh Rathore in Tanhaji: The Unsung Warrior మూవీలో ఉదయభన్ సింగ్ రాథోడ్ వంటి డేరింగ్ రోల్స్ ఎంచుకున్నాడు. కరీనా కపూర్‌, సైఫ్ అలీ ఖాన్ రెండవ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వనించ బోతున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం 2019లో సైఫ్ అలీ ఖాన్ రూ. 17.03 కోట్లు సంపాదించాడు.