Kriti Sanon: ప్రభాస్‌కు సిగ్గు ఎక్కువ.. కానీ ఒకసారి కలిస్తే ఇక అంతే!

మన రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు బాలీవుడ్ బడా స్టార్ హీరోలకు అందనంత స్పీడ్ తో వరసగా భారీ ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే రాధేశ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను మొదలుపెట్టేశాడు. ఇక ఇప్పటికే ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తోన్న ఆది పురుష్ షూటింగ్ మధ్యలో ఉంది.

Kriti Sanon

Kriti Sanon: మన రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు బాలీవుడ్ బడా స్టార్ హీరోలకు అందనంత స్పీడ్ తో వరసగా భారీ ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే రాధేశ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను మొదలుపెట్టేశాడు. ఇక ఇప్పటికే ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తోన్న ఆది పురుష్ షూటింగ్ మధ్యలో ఉంది. రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నుండగా సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు, నాగచైతన్యలతో నటించిన కృతికి ప్రభాస్ తో ఇదే తొలిసారి. అయినా కృతి ప్రభాస్ ఇట్టే కలిసిపోయాడట. ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో కలిసి ట్రావెల్ చేసిన కృతి రెబల్ స్టార్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్ర‌భాస్‌ను చాలా సిగ్గుగా ఉంటాడని విన్నానని.. అయితే ఒకసారి మాట్లాడ‌టం ప్రారంభించాక మేమిద్ద‌రం మాట్లాడుకుంటూ ఉండిపోయామని కృతి చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. ప్ర‌భాస్ కు చదవడం అంటే ఇష్టమని.. తనకు కూడా ఇష్టం కావడంతో బాగా కలిసిపోయామని చెప్పింది. ప్రభాస్ ఆహార ప్రియుడని.. అత‌డు మంచిగా తిన‌డ‌మే కాదు. తిండి విష‌యంలో సెట్‌లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ.. అంద‌రికీ వెరైటీల‌ను పెడుతుంటాడని.. ప్ర‌భాస్‌తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం నిజంగా అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఆదిపురుష్ గురించి మాట్లాడిన కృతి.. అతనికి బాగా సూట్ అయ్యే పాత్రను ఎంచుకున్నాడని చెప్పింది.