Prabhas
Prabhas : ప్రభాస్ బాహుబలి నుంచి అన్ని భారీ, స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో రాధేశ్యామ్ ప్రేమకథ చేసినా, అందులో కాస్త రొమాన్స్ ఉన్నా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత ప్రభాస్ ఘాటు రొమాన్స్ తో పాటు నాటు యాక్షన్ చేయబోతున్నాడని తెలుస్తుంది.(Prabhas)
ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే హీరో – హీరోయిన్స్ మధ్య ఘాటు రొమాన్స్, లిప్ కిస్ సీన్స్ ఉంటాయని తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. యాక్షన్ కూడా అదే లెవల్లో ఉంటుంది. ఇవన్నీ A సర్టిఫికెట్ సినిమాలే.
Also See : Anasuya Bharadwaj : న్యూ ఇయర్ స్పెషల్.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. ఫొటోలు వైరల్..
దీంతో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కూడా పోలీస్ పాత్ర కాబట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని ఫ్యాన్స్ భావించారు. అయితే నేడు న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా తన సిక్స్ ప్యాక్ బాడీపై అక్కడక్కడా దెబ్బలు తగిలితే కట్లు కట్టి ఉండగా హీరోయిన్ త్రిప్తి డిమ్రి ప్రభాస్ సిగరెట్ వెలిగిస్తూ చీరలో అందంగా కనిపించింది.
ఈ పోస్టర్ చూస్తుంటేనే యాక్షన్ సీన్ తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సందీప్ రెడ్డి సినిమా కావడం, యానిమల్ లో రొమాన్స్ తో అదరగొట్టిన త్రిప్తి డిమ్రి కూడా ఉండటంతో కచ్చితంగా ఈసారి ప్రభాస్ – త్రిప్తి డిమ్రి కి లిప్ కిస్ సీన్స్ ఉంటాయని, ఇద్దరి మధ్య ఘాటు రొమాన్స్ సీన్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఇక యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉంటాయని స్పిరిట్ సినిమా ప్రకటించినప్పుడే అర్ధమయిపోయింది. మొత్తానికి ప్రభాస్ రొమాంటిక్ సీన్స్, సిక్స్ ప్యాక్ తో త్వరలోనే ఫ్యాన్స్ ని అలరించనున్నాడని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కంఫర్మ్ అని అంటున్నారు.
Also See : Kiran Abbavaram : న్యూ ఇయర్ స్పెషల్.. భార్య, కొడుకుతో కిరణ్ అబ్బవరం ట్రెడిషినల్ లుక్స్..