Prabhas 2
Prabhas : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ బర్త్ డే సందర్భంగా రెబెల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పారు. తన ఇన్‌స్టా స్టేటస్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ప్రభాస్ విష్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే రెబల్ స్టార్ ప్రభాస్ తెరపై నటనతో విశ్వరూపం చూపిస్తారు. తక్కువ మాట్లాడతారు. చాలా మొహమాటపడతారు. నటుడిగా తనదైన స్టైల్‌తో అందర్నీ అలరిస్తూ వచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. వరుస సినిమాలు చేస్తున్నా చాలారోజులుగా హిట్స్ లేని ప్రభాస్ సలార్‌తో తిరిగి సక్సెస్ అందుకున్నారు. విషయానికి వస్తే ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కి ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో బర్త్ డే విష్ పెట్టారు. ఆ స్టేటస్ చూసిన వారికి మన ప్రభాసేనా విష్ చేసింది అని ఆశ్చర్యం వేసింది.
Prabhas 1
దీపికా పదుకోన్‌ని మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ శుభాకాంక్షలు చెప్పారు ప్రభాస్. #Kalki2898AD అని హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ కాంబోలో వస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. ఇందులో ప్రభాస్‌తో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. కమల్ హాసన్, దిశా పటాని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ చూడాలంటే 93 రోజులు వెయిట్ చేయాలని నాగ్ అశ్విన్ ఇటీవలే చెప్పారు. త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారట. ఇక ఈ సినిమా నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ దీపికా పదుకోన్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది.
Wishing our beautiful @deepikapadukone a very Happy Birthday!
The wait may be longer, but light will shine through… #Kalki2898AD pic.twitter.com/XeqfqvtZEQ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2024