×
Ad

Prabhu Deva: చిరంజీవి లేకపోతే నేను లేను.. ఆయనవల్లే ఈరోజు ఇలా.. 15 ఏళ్ళ వయసులోనే..

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా(Prabhu Deva) గుర్తింపు పొందారు ప్రభుదేవా. ఆయన డాన్స్ చేస్తుంటే అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా, స్ప్రింగులు ఉన్నాయా అనే అనుమానం రావడం సహజం.

Prabhu Deva made interesting comments on Chiranjeevi

Prabhu Deva: ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందారు ప్రభుదేవా. ఆయన డాన్స్ చేస్తుంటే అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా, స్ప్రింగులు ఉన్నాయా అనే అనుమానం రావడం సహజం. అంతలా తన శరీరాన్ని మెలికలు తిప్పేస్తూ డాన్స్ చేస్తాడు ప్రభుదేవా. అందుకే, ఆయన డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఆయనకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా ఆయన మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఫ్యానేనట. ఈ విషయాన్ని కొన్ని (Prabhu Deva)వందలసార్లు పెద్ద పెద్ద స్టేజెస్ పైన చెప్పాడు ప్రభుదేవా. తాజాగా ఆయన జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్బంగా ప్రభుదేవా మాట్లాడుతూ చిరంజీవిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Rishab Shetty: ఇంటర్వ్యూలు తమిళ్ లో.. తెలుగులో మాత్రం కన్నడ.. ఇదెక్కడి న్యాయం రిషబ్

ఈ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ.. “నాకు హిప్‌అప్‌, బ్రేక్‌ డ్యాన్స్‌ తెలియవు. నాకు నా డ్యాన్స్‌ మాత్రమే తెలుగు. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది.చాలా మందికి అవకాశాలు ఇస్తుంది. కానీ, నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం తప్పదు. ఆ విషయంలో నాకు ఇండస్ట్రీలో చిరంజీవి ఆదర్శం. ఆయన కష్టాన్ని నేను కళ్లారా చూశాను. అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు సినిమాలో మెరుపులా అనే సాంగ్‌కి నేనే కొరియోగ్రఫీ చేశాను. అప్పుడు ఆయన డ్యాన్స్‌ చూసి నేను ఆశ్చర్యపోయాను. నాకు ఈరోజు ఇంత గుర్తింపు రావడానికి కారణం చిరంజీవే. టాలెంట్‌ ఉన్నవారిని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. అలాగే నాకు కూడా అవకాశం ఇచ్చారు. అబ్బనీ తీయనిదెబ్బ సాంగ్ కొరియోగ్రఫీలో నాన్నతో పాటు నేనూ చేశాను. అప్పుడు నా వయసు 15 ఏళ్లు” అంటూ చెప్పుకొచ్చాడు ప్రభుదేవా. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.