Rishab Shetty: ఇంటర్వ్యూలు తమిళ్ లో.. తెలుగులో మాత్రం కన్నడ.. ఇదెక్కడి న్యాయం రిషబ్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కాంతార: చాఫ్టర్ 1. సూపర్ హిట్ కాంతార (Rishab Shetty)సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rishab Shetty: ఇంటర్వ్యూలు తమిళ్ లో.. తెలుగులో మాత్రం కన్నడ.. ఇదెక్కడి న్యాయం రిషబ్

Telugu audience furious over Rishab Shetty

Updated On : September 29, 2025 / 12:52 PM IST

Rishab Shetty: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కాంతార: చాఫ్టర్ 1. సూపర్ హిట్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది. దాంతో, ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ సినిమా బైకాట్ వివాదాన్ని ఎదుర్కొంటోంది. దానికి కారణం ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ (Rishab Shetty)ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రిషబ్ శెట్టి తన స్పీచ్ మొత్తం కన్నడలోనే ఇచ్చారు. ఆయన మాట్లాడింది అక్కడకు వచ్చిన ఏ ఒక్కరికీ అర్థం కాలేదు.

Sai Abhyankar: లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్.. ఫస్ట్ మూవీకే భారీ రెమ్యునరేషన్.. అనిరుధ్, తమన్, దేవి జాగ్రత్తగా పడాల్సిందే

కనీసం, స్పీచ్ మొదట్లో అయినా తెలుగులో మాట్లాడి ఆ తరువాత కన్నడ, ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడినా బాగుండేది. కానీ, తన స్పీచ్ మొత్తం కన్నడలోనే ఇచ్చాడు రిషబ్ శెట్టి. ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. తమిళ ఇంటర్వ్యూలో మాత్రం అక్కడి భాషలో ఇచ్చి ఇక్కడ ఇలా చేయడం కరక్ట్ కాదు అని వాదిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కాంతార: చాఫ్టర్ 1 సినిమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ రేట్స్ హైక్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ విషయంలో మన ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకు మన రాష్ట్రాల్లో హైక్ ఎందుకు ఇవ్వాలి అంటూ మండిపడుతున్నారు.

ఇక, ఇటీవల విడుదలైన ఓజీ సినిమా విషయంలో కూడా కర్ణాటకలో వివాదం చెలరేగింది. అక్కడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిలీజ్ సందర్బంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో తెలుగు ఉండటం పట్ల అక్కడి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లెక్సీ చించేశారు. దాంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. భాషకు అంత ప్రాధాన్యం ఇచ్చే మీరు ఇక్కడ తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడటం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు మొదలుపెట్టారు.. మేము కంటిన్యూ చేస్తున్నాం అనే విధంగా కాంతార వివాదాం నడుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.