Sai Abhyankar: లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్.. ఫస్ట్ మూవీకే భారీ రెమ్యునరేషన్.. అనిరుధ్, తమన్, దేవి జాగ్రత్తపడాల్సిందే
తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్(Sai Abhyankar). చేసింది ఒక్క సినిమానే కానీ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

Sai Abhyankar took a remuneration of Rs. 2 crore for a Malayalam film
Sai Abhyankar: తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్. చేసింది ఒక్క సినిమానే కానీ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. మనోడి టాలెంట్ చూసి మేకర్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. ఇదే విషయం గురించి బాల్టి సినిమా నిర్మాత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మలయాళ సినిమా సూపర్ హిట్(Sai Abhyankar) టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ మెయిన్ హైలెట్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే, ఆ రెమ్యునరేషన్ ఇచ్చాం అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత.
ఇంకా ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. బాల్టి సినిమా కోసం సాయి అభ్యంకర్‌కు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాం. ప్రెజెంట్ అతనికి క్రేజ్, డిమాండ్ ఆ రేంజ్ ఉంది. అందుకే ఆ అమౌంట్ ఇచ్చాం. బాల్టి మూవీ కమిట్ అవ్వడానికి ముందే అతడి చేతిలో పది ప్రెస్టీజియస్ సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ, మాలీవుడ్ ఇండస్ట్రీ ఇది రికార్డ్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు మాలీవుడ్‌లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ లో ఇంత రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వలేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో. ప్రస్తుతం సాయి అభ్యంకర్‌కు పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సాయి అభ్యంకర్ విషయానికి వస్తే.. ఆయన పేరెంట్స్ ప్రముఖ సింగర్స్ టిప్పు, హరిణి అనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఎక్కడ కూడా వారి పేరును వాడుకోకుండా కేవలం తన సొంత టాలెంట్‌తోనే గుర్తింపు తెచ్చకున్నాడు సాయి అభ్యంకర్. చేసిన మొదటి ప్రైవేట్ ఆల్బమ్స్‌తో మ్యూజిక్ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ కంపోజర్ ఇప్పుడు అందరి ఫెవరెట్ గా మారిపోయాడు. ప్రెజెంట్ ఈ మ్యూజిక్ సెన్సేషన్ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్- అట్లీ సినిమా కూడా ఉంది. హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ అందించే సమకూర్చే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు. ఇక తమిళంలో సూర్య కరుప్పు, లారెన్స్ బెంజ్, శింబు49, మార్షల్, డ్యూడ్ లాంటి చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు.