Pawan kalyan-Team India: ఇది దసరా బహుమతి.. దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది.. టీం ఇండియాకు పవన్ శుబాకాంక్షలు

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై అద్భుతమైన విజయం సాధించి ఆసియా(Pawan kalyan-Team India) కప్‌ విజేతగా నిలిచింది భారత్. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత వచ్చిన ఈ విజయం క్రికెట్‌ అభిమానులతోపాటు భారత్‌దేశ ప్రజలందరిలోనూ సంతోషాన్ని నింపింది.

Pawan kalyan-Team India: ఇది దసరా బహుమతి.. దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది.. టీం ఇండియాకు పవన్ శుబాకాంక్షలు

Pawan Kalyan congratulates Team India for winning the Asia Cup

Updated On : September 29, 2025 / 9:55 AM IST

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై అద్భుతమైన విజయం సాధించి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది భారత్. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత వచ్చిన ఈ విజయం క్రికెట్‌ అభిమానులతోపాటు భారత్‌దేశ ప్రజలందరిలోనూ సంతోషాన్ని నింపింది. దీంతో టీమ్‌ ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, భారత ప్రజలు టీమ్‌ ఇండియాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Samantha: నాకు ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదు.. అదే ప్రేమ అనుకున్నా.. ఇప్పుడా జ్ఞాపకాలు..

తాజాగా టాలీవుడ్ హీరో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా భారత జట్టు సంభ్యులపై ప్రశంసలు కురిపించారు. ‘‘టీమ్‌ ఇండియా మరోసారి సత్తా చాటింది. తొమ్మిదోసారి ఆసియా కప్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. జట్టు సమష్టికృషితోనే ఈ చారిత్రక విజయం సాధ్యమయ్యింది. కచ్చితంగా ఇది మన భారతదేశానికి ముందస్తు దసరా కనుక. దీన్ని దేశమంతా సెలబ్రేట్‌ చేసుకుంటుంది” అంటూ రాసుకొచ్చాడు. దాంతో పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.