Samantha: నాకు ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదు.. అదే ప్రేమ అనుకున్నా.. ఇప్పుడా జ్ఞాపకాలు..

స్టార్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో దాదాపు అందరు స్టార్ (Samantha)హీరోలతో వర్క్ చేసింది. స్టార్ స్టేటస్ కి ఎదిగింది. ఆ తరువాత పర్సనల్ లైఫ్ లో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల సినిమాలకు దూరం అయ్యింది.

Samantha: నాకు ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదు.. అదే ప్రేమ అనుకున్నా.. ఇప్పుడా జ్ఞాపకాలు..

Samantha's emotional post is going viral on social media.

Updated On : September 29, 2025 / 9:22 AM IST

Samantha: స్టార్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసింది. స్టార్ స్టేటస్ కి ఎదిగింది. ఆ తరువాత పర్సనల్ లైఫ్ లో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల సినిమాలకు దూరం అయ్యింది. ఆ తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్: హానీ, బన్నీ లాంటి సినిమాలు చేసింది. అంతకుముందు కొంతకాలం మాయిసైటిక్ (Samantha)వ్యాధితో బాధపడిన సమంత చాలా బాధను అనుభవించింది. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ బ్యూటీ మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టింది.

Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్ లో అందాల చందమామ.. కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్

ఇదిలా ఉంటే, తాజహా సామ్ సామ్ పెట్టినా సోషల్ మీడియా పోస్ట్ ఒకరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “రీసెంట్ గా నేను, నా మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ముప్పై ఏళ్ల తర్వాత మనం ప్రపంచాన్ని చూసే తీరు మారిపోతుంది. మన అందం, వయసు, మెరుపు అన్నిట్లోను మార్పు వస్తుంది. అందుకే జీవితాన్ని ఇరవైలలోనే ఆస్వాదించాలి. కానీ, నేను ఇరవైలలో చాలా గందరగోళంగా గడిపాను. విజయాల కోసం, గుర్తింపు కోసం మాత్రమే ఆలోచించాను. నన్ను, నేను చాలా కోల్పోయాను.

ఆ సమయంలో, ప్రేమ గురించి నాకెవరూ చెప్పలేదు. నిజానికి, నిజమైన ప్రేమ మనలోనే ఉటుంది. బయట నుంచి రాదు. మనల్ని మనం ప్రేమించుకోవడమే అసలైన ప్రేమ అని అర్థమయ్యింది. నేను ఇప్పుడు ముప్పైల్లో ఉన్నాను. నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నా. గతం తాలూకు జ్ఞాపకాలను మోయడం మానేశా. ప్రతి అమ్మాయి ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే, మీరు మీలా ఉన్నప్పుడు మాత్రమే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా ఉంటారు” అంటూ పోస్ట్ చేసింది సమంత.