Prabhudeva Introduced his Son Rishii Deva in Chennai Dance event
Prabhudeva Son : ఒక డ్యాన్స్ మాస్టర్ కొడుకుగా సినీ పరిరమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా తన డ్యాన్స్ స్టెప్స్ తో స్టార్ హీరోలను సైతం మెప్పించి చిన్న ఏజ్ లోనే స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. ఓ పక్క డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తూనే మరో పక్క హీరోగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు కూడా డ్యాన్స్ మాస్టార్లే.
తాజాగా ప్రభుదేవా తన వారసుడు రిషి దేవాను పరిచయం చేసాడు. ప్రభుదేవ మొదటి భార్య లతాకు ముగ్గురు పిల్లలు ఉండగా ఒకరు క్యాన్సర్ తో చనిపోయారు. రెండవ భార్య హిమానితో ఒక కూతురు ఉంది. ప్రభుదేవ – లతా కుమారుడు రిషి దేవాను తాజాగా ప్రభుదేవా గ్రాండ్ గా అందరికి ఇంట్రడ్యూస్ చేసాడు. ఇటీవల చెన్నైలో ప్రభుదేవా మొదటిసారిగా డ్యాన్స్ లైవ్ కాన్సర్ట్ వైబ్ అనే పేరుతో ఏర్పాటు చేసారు.
Also Read : Kubera : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?
ఈ ఈవెంట్ లో కొన్ని గంటల పాటు రకరకాల సాంగ్స్ కు ప్రభుదేవా, అతని టీమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. ఈ ఈవెంట్ కు అనేకమంది సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ప్రభుదేవా తన కొడుకు రిషి దేవాతో కలిసి డ్యాన్స్ చేసి అందరికి పరిచయం చేసాడు.
ఈ ఈవెంట్లో తండ్రి – కొడుకులు చేసిన డ్యాన్స్ ని ప్రభుదేవా తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా కొడుకు రిషి దేవాని పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. మేమిద్దరం మొదటిసారి స్టేజ్ షేర్ చేసుకున్నాము. ఇది డ్యాన్స్ కంటే ఎక్కువ. వారసత్వం, ప్యాషన్ తో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చారు.
Also Read : Nagarjuna : అక్కినేని అభిమాని మృతి.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్.. మా ఫ్యామిలీకి స్థంభం లాంటి వారు అంటూ..
దీంతో ప్రభుదేవా కొడుకు రిషి దేవా కుడా డ్యాన్స్ లోకే వచ్చాడని, త్వరలోనే డ్యాన్స్ మాస్టర్ అవుతాడని తెలుస్తుంది. ప్రభుదేవా ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ తన కొడుకు సోషల్ మీడియా అకౌంట్ ని కూడా ట్యాగ్ చేసాడు. దీంతో ప్రభుదేవా అభిమానులు రిషిదేవాను కూడా ఫాలో అవుతున్నారు. మరి తండ్రి లాగే రిషి కూడా స్టార్ కొరియోగ్రాఫర్ అవుతాడా చూడాలి.