Prakash Raj and Pawan Kalyan face each other in OG Movie Shoot Rumours goes Viral
Prakash Raj – Pawan Kalyan : ఇటీవల తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వివాదం జరిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మధ్యలో వచ్చి ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడంతో పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. దీనికి మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏదో ఒకటి వరుస ట్వీట్స్ వేసి పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసాడు. కానీ పవన్ అసలు పట్టించుకోకుండా వదిలేసాడు. అయినా ప్రకాష్ రాజ్ ఏదో ఒక ట్వీట్ వేస్తూ హడావిడి చేసాడు.
దీంతో వీరిద్దరిమధ్య వైరం నెలకొంది అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు ఎదురుబడబోతున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలకు ఇప్పుడు డేట్స్ ఇచ్చి పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ జరుగుతుంది. నవంబర్ రెండో వారం నుంచి OG షూట్ కూడా జరుగుతుందని మూవీ యూనిట్ ప్రకటించారు.
Also Read : Pushpa 2 : పుష్ప రాజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. అదిరిపోయిన పోస్టర్..
అయితే OG సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడని సమాచారం. పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశాలు ఉన్నాయట. దీంతో సెట్లో ఈ ఇద్దరు ఎదురుపడితే ఎలా ఉంటుందో? రాజకీయాలు పట్టించుకోకుండా సినిమా షూట్ చేసుకొని వెళ్ళిపోతారా? అక్కడ కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడతారా అని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. మరి ఈ రేంజ్ లో వివాదం జరిగిన తర్వాత ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ ఎదురుపడితే ఎలా ఉంటుందో సెట్లో ఉన్నవాళ్ళకి తెలియాలి.