Pushpa 2 : పుష్ప రాజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్‌.. అదిరిపోయిన పోస్ట‌ర్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ పుష్ప 2.

Pushpa 2 : పుష్ప రాజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్‌.. అదిరిపోయిన పోస్ట‌ర్‌..

Pushpa 2 Allu Arjun

Updated On : October 17, 2024 / 11:58 AM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ర‌ష్మిక మందాన హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 6 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్రం తాజాగా కౌంట్ డౌన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

మ‌రో 50 రోజుల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో అల్లు అర్జున్ కుర్చీలో కూర్చోని పిడికిలి బిగించి చాలా సిరీయ‌స్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రాన్ని చూసేందుకు వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Pradeep Machiraju : మొత్తానికి బయటకి వచ్చిన ప్రదీప్.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో..

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. అల్లు అర్జున్‌తో పాటు కీల‌క న‌టీన‌టులు అంద‌రూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.