Maa Elections: తెగేదాకా లాక్కండి.. ఎన్నికలపై ప్రకాష్ రాజ్!

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. పక్కా పొలిటికల్ పార్టీల ఎన్నికలను తలపించేలా కనిపించిన ఈ ఎన్నికలపై ప్రస్తుతం సందిగ్దత కొనసాగుతుంది.

Maa Elections: MAA Elections: సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. పక్కా పొలిటికల్ పార్టీల ఎన్నికలను తలపించేలా కనిపించిన ఈ ఎన్నికలపై ప్రస్తుతం సందిగ్దత కొనసాగుతుంది.

పెద్దలు ఈ ఎన్నికల వివాదంపై కొద్ది రోజులుగా చర్చలు జరుపుతుండగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి?.. సామరస్యంగా ఈ ఎన్నికలను ఎలా ముగించాలి? ఒకవేళ ఏకగ్రీవంగా ఎంపిక చేయాలంటే ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అనే అంశాలపై తీవ్ర కసరత్తులు జరుగుతున్నట్లు వినిపిస్తుంది.

ఈ మధ్యనే ప్రస్తుత మా ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనంతరం.. మా ఎన్నికలపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించాలనే ఉద్దేశ్యంతో కృష్ణంరాజు, మురళి మోహన్, మోహన్ బాబు, శివకృష్ణ తదితర పెద్దల ఆధ్వర్యంలో వర్చువల్ మీటింగ్‌ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

ఆగస్టులోనే మా’ జనరల్‌ బాడీ సమావేశం, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని.. సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరిపే పరిస్థితి కనిపిస్తుందని కూడా కథనాలు వచ్చాయి. ఇక కృష్ణంరాజు అద్వర్యంలో జరిగిన సమావేశం అనంతరం.. ఏకగ్రీవంపై విస్తృత చర్చలు జరుగుతున్నట్లుగా వినిపించింది. ఏకగ్రీవం చేయడమే ఉత్తమం అనే కోణంలో మురళి మోహన్ వంటి పెద్దలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అయితే.. మా ఎన్నికల నిర్వహణ.. ఏకగ్రీవంపై ఒకవైపు చర్చలు జరుగుతుండగానే ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. తెగేదాకా లాక్కండి అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి Just Asking అంటూ ట్యాగ్ కూడా తగిలించారు. ఇది మా ఎన్నికలను ఉద్దేశించే చేసిన పోస్ట్ గా అర్ధమవుతుండగా ప్రకాష్ రాజ్ దేని గురించి ఈ వ్యాఖ్య చేశారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బహుశా ఏకగ్రీవం విషయంపైనే ప్రకాష్ రాజ్ ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చనే భావన కలుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు