Prakash Raj posted an interesting update about Varanasi movie
Prakash Raj: సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విల్లన్ గా నటిస్తున్నాడు. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన వారణాసి కాన్సెప్ట్ వీడియోకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నేషనల్ లెవల్లో ఈ వీడియో ట్రెండ్ అయ్యింది. హాలీవుడ్ మీడియా కూడా ఆ వీడియో గురించి మాట్లాడుకున్నారు అంటే ఈ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Ntr: నీ వెనుక నేను ఉన్నాను.. ఛాంపియన్ మూవీపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj). వారణాసి సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.. ‘వారణాసి సినిమా కోసం ఒక అద్భుతమైన షెడ్యూల్ ని కంప్లీట్ చేశాము. ఈ పాత్ర నాలోని నటుడి దాహార్తిని తీరుస్తోంది. మహేష్ బాబు, పృధ్విరాజ్, ప్రియాంక చోప్రా మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తరువాతి షెడ్యూల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను”అంటూ రాసుకొచ్చాడు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
గతంలో ప్రకాష్ రాజ్ రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో నటించాడు. రవి తేజ హీరోగా వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ప్రకాష్ రాజ్ చేశాడు. మళ్ళీ ఇంతకాలానికి వారణాసి సినిమాలో నటిస్తున్నాడు ప్రకాష్ రాజ్. మరి చిన్న పాత్రతోనే ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగల ప్రకాష్ రాజ్ వారణాసి సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది చూడాలి. ఇక రాజమౌళి-మహేష్ బాబు వారణాసి సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.