Ntr: నీ వెనుక నేను ఉన్నాను.. ఛాంపియన్ మూవీపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న ఛాంపియన్ సినిమాకు తన సపోర్ట్ కూడా అందించాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr).
Star hero NTR gave his support to Champion movie.
Ntr: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. కొత్త దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా మూవీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.40 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు తన సపోర్ట్ కూడా అందించాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr). ఈమేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
Allu Arjun: ఒక్క హీరో.. ఆరుగురు స్టార్ డైరెక్టర్స్.. ఇది కదా ఐకాన్ స్టార్ రేంజ్
“నా స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఇప్పుడు వస్తున్న ఛాంపియన్ సినిమా వరకు.. స్వప్న సినిమా కొత్త గొంతుకలను ప్రోత్సహిస్తూనే ఉంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా వెనుక సినిమాపై వారికున్న అమితమైన ప్రేమ కనిపిస్తూనే ఉంటుంది. స్వప్న దత్ నాకు ఎప్పుడూ అండగా ఉంటుంది. నేను కూడా స్వప్న టీమ్‌కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూనే ఉంటాను. రోషన్, అనస్వర రాజన్, ప్రదీప్ అద్వైతంకు ఆల్ ది బెస్ట్. 2025 ముగింపులో ఒక మెమరబుల్ హిట్ గా ఈ సినిమా నిలువాలని ఆశిస్తున్నట్లు” పోస్ట్ చేశారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్స్ కి ఆడియన్స్ నుంచి మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. మరి విడుదల తరువాత ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.
