Allu Arjun: ఒక్క హీరో.. ఆరుగురు స్టార్ డైరెక్టర్స్.. ఇది కదా ఐకాన్ స్టార్ రేంజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో సినిమాలు చేసేందుకు ఆరుగురు స్టార్ డైరెక్టర్స్ కథలు సిద్ధం చేసుకోని ఉన్నారట. వారిలో ఒకరు సంజయ్ లీలా బన్సాలి.

Allu Arjun: ఒక్క హీరో.. ఆరుగురు స్టార్ డైరెక్టర్స్.. ఇది కదా ఐకాన్ స్టార్ రేంజ్

Six star directors are planning to make a film with Allu Arjun.

Updated On : December 25, 2025 / 7:57 AM IST

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినీ రికార్డ్స్ అన్నీ తిరగరాసింది ఈ సినిమా. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ రేంజ్ కూడా ఇంటర్నేషనల్ లెవల్లో పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే, స్టార్ మేకర్స్ అందరు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈ హీరో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ తో రానున్న ఈ సినిమాను తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.

Amar Deep: వీడు తోపు, తురుమ్, చితకొట్టేశాడని ఎవరూ చెప్పరు.. అదే మా నమ్మకం..

అయితే, ఈ సినిమా తరువాత అల్లు అర్జున్(Allu Arjun) చేయనున్న సినిమా గురించి చాలా రకాల న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండియా వైడ్ గా ఉన్న 6 మంది స్టార్ డైరెక్టర్స్ ఈ హీరో కోసం కథలు సిద్ధం చేస్తున్నారట. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. పీరియాడికల్ అండ్ భారీ సెట్స్ తో సినిమాలు చేయడంలో ఈ దర్శకుడు టాప్. అలాంటి ఈ డైరెక్టర్ అల్లు అర్జున్ కోసం ఒక పీరియాడికల్ కథను సిద్ధం చేశాడట. కానీ,అల్లు అర్జున్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. ఇక తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సైతం అల్లు అర్జున్ కోసం ఒక గ్యాంగ్ స్టార్ కథను సిద్ధం చేశాడట. కథ విన్న అల్లు అర్జున్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. మరో తమిళ దర్శకుడు నెల్సన్ కుమార్ కూడా ఈ మధ్యే అల్లు అర్జున్ కి ఒక సాలిడ్ కంటెంట్ ఉన్న కథను వినిపించాడట. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక తెలుగు దర్శకుడు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా కూడా అల్లు అర్జున్ కోసం కథలు రెడీ చేసుకొని సిద్ధంగా ఉన్నారట. ఆ మధ్య అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఒక భారీ సినిమా సెట్ అయ్యి ఆగిపోయింది.

అయితే, అదే కథతో ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి సినిమా ప్లాన్ చేశాడు త్రివిక్రం. కానీ, ఇప్పుడు మరోసారి ఆ కథ అల్లు అర్జున్ వద్దకే వచ్చిందట. హిందూ పురాణాలకు సంబంధించి ఒక శక్తివంతమైన పాత్రను తీసుకొని ఈ కథను సిద్ధం చేశాడట. కాబట్టి, ఆ కథకు అల్లు అర్జున్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్. ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని టాక్. అన్నీ సెట్ అయితే అట్లీ సినిమా తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కూడా ఇదే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పుడు ఏకంగా ఆరుగురు స్టార్ డైరెక్టర్స్ అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ న్యూస్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది కదా అల్లు అర్జున్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.