Amar Deep: వీడు తోపు, తురుమ్, చితకొట్టేశాడని ఎవరూ చెప్పరు.. అదే మా నమ్మకం..

బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్ దీప్(Amar Deep) ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా "సుమతి శతకం". దర్శకుడూ ఏంఏం నాయుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శైలి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

Amar Deep: వీడు తోపు, తురుమ్, చితకొట్టేశాడని ఎవరూ చెప్పరు.. అదే మా నమ్మకం..

Amar Deep interesting comments about Sumathi Satakam Movie

Updated On : December 25, 2025 / 7:28 AM IST

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్ దీప్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “సుమతి శతకం”. దర్శకుడూ ఏంఏం నాయుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శైలి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా సుమతి శతకం సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో హీరో అమర్ దీప్ మాట్లాడుతూ సుమతి శతకం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Dhurandhar: మా చిత్రం వాళ్ళ నోళ్లు మూయించింది.. దురంధర్ దర్శకుడు చెప్పింది నిజమేనా..

ఈ ఈవెంట్ లో ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ..”టీవీ నుంచి వచినవాళ్ళకి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అంతగా రావడం లేదు. ఇప్పటికే సుధీర్, ప్రదీప్, యాంకర్ రవి ఇలా చాలా మంది సినిమాలు చేశారు. కానీ, సక్సెస్ అవలేదు. అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు. మరి అలాంటి సిచువేషన్ లో మీ సినిమాకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు” అంటూ అడిగాడు. దానికి సమాధానంగా అమర్ దీప్(Amar Deep) మాట్లాడుతూ.. “బిగ్ బాస్ గురించి వదిలేయండి. అది మా ఛానల్ వాళ్ళు పంపించారు. ఇక సుమతి శతకం సినిమా మౌత్ టాక్ సినిమా. ఈ సినిమా చూసి వీడు అదరగొట్టేశాడు, చితకొట్టేశాడు అని ఎవరు అనకపోవచ్చు కానీ, ఒక పది మంది సినిమా చూస్తే తప్పకుండ ఇంకో పది మందికి చెప్తారు. ఈ సీన్ బాగుంది, ఈ కామెడీ బాగుంది అని మాట్లాడుకుంటారు. అలాంటి సినిమా మా సుమతి శతకం.

కంటెంట్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా లావీష్ గా చేశాము. నన్ను ఇంతకాలం ఎలా చూశారో అలానే ఈ సినిమాలో కూడా కనిపిస్తాను. అందుకే ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు అమర్ దీప్. దీంతో అమర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి అమర్ దీప్ చెప్పినట్టుగా ఫిబ్రవరి 6న విడుదలవుతున్న సుమతి శతకం సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.