Prakash Raj – Pawan Kalyan : నేను చెప్పింది ఏంటి..? అర్ధం చేసుకోండి ప్లీజ్.. పవన్ కళ్యాణ్ కి మళ్ళీ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..

దీంతో తాజాగా మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ చేసారు.

Prakash Raj

Prakash Raj – Pawan Kalyan : ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో నిలబడి సనాతన ధర్మం అంటూ పోరాడుతున్నారు. అయితే పవన్ పై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. లడ్డు వివాదం మొదలయ్యాక ఇటీవల ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి.. తప్పు జరిగి ఉంటే మీరే అధికారంలో ఉన్నారుగా విచారణ చేయించండి అంతే కానీ మీరెందుకు ఆందోళనలను వ్యాప్తి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సమస్యని ఎందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే మన దేశంలో చాలా మతపరమైన గొడవలు ఉన్నాయి అని ట్వీట్ చేసారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ్టి ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలని ఉద్దేశించి.. హిందువుల గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ కి సంబంధం ఏంటి..? ఏమీ పిచ్చి పట్టింది మీకు హిందువుల అవమానం జరిగితే మాట్లాడటం తప్పా అంటూ ప్రశ్నిస్తూనే గట్టిగ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముందు నుంచి ప్రకాష్ రాజ్ బీజేపీకి, హిందువులకు మద్దతుగా మాట్లాడే వారిపై కౌంటర్లు వేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ విమర్శలు చేస్తారని తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా అలాగే రిప్లై ఇవ్వడంతో పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read : Actor Karthi : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హీరో కార్తీ

దీంతో తాజాగా మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ ఓ వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో మాట్లాడుతూ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూసాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటి? నేను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30 వ తారీఖు తర్వాత వచ్చి మీరు అన్న ప్రతి మాటకు సమాధానం ఇస్తాను. ఈ లోపు మీకు కుదిరితే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్ధం చేసుకోండి ప్లీజ్ అని అన్నారు.  మరి ప్రకాష్ రాజ్ మళ్ళీ వచ్చి ఈ లడ్డు వివాదం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతారో చూడాలి.