×
Ad

Prakash Raj: తెలంగాణాలో ఎమ్మెల్యే ల కొనుగోలు పై ప్రకాష్ రాజ్ సంచలన ట్విట్..

తన విలక్షణమైన నటనతో సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు "ప్రకాష్ రాజ్". ఈ కన్నడ నటుడు దేశ రాజకీయ విషయాలను విశ్లేషిస్తూ విమర్శిస్తుంటాడు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా తెలంగాణాలో ఎమ్మెల్యే ల కొనుగోలు పై సంచలన ట్విట్ చేశాడు.

  • Published On : November 4, 2022 / 03:32 PM IST

Prakash Raj

Prakash Raj: తన విలక్షణమైన నటనతో సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు “ప్రకాష్ రాజ్”. తెలుగు, తమిళ, హిందీ మరియు ఇతర భాషల్లో వందలకు పైగా సినిమాలు తీసిన ఈ కన్నడ నటుడు దేశ రాజకీయ విషయాలను విశ్లేషిస్తూ విమర్శిస్తుంటాడు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటాడు.

Prakash Raj: మోదీని ఆకాశానికెత్తిన హీరో విశాల్.. కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్!

గత లోకసభ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అపజయం పాలు అయ్యాడు. కాగా ప్రకాష్ రాజ్ తన స్నేహితురాలు గౌరీ లంకేశ్ హత్య ఘటన తర్వాత సోషల్ మీడియాలో #justasking అనే హ్యాష్‌ట్యాగ్‌తో సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నింస్తున్నాడు. తాజాగా తెలంగాణాలో ఎమ్మెల్యే ల కొనుగోలు పై సంచలన ట్విట్ చేశాడు.

“తెలంగాణా లో ఎమ్మెల్యేల కొనుగోలు అత్యంత సిగ్గులేనితనం. ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు చేసే ఇటువంటి పనులతో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. పరువును అమ్ముకున్న ఇటువంటి నాయకులు ప్రజాస్వామ్యాని కూడా వేలానికి పెడతారు” అంటూ ట్వీట్ చేశాడు.