Pranaya Godari : ప్రణయ గోదారి నుంచి లవ్ సాంగ్ విన్నారా.. శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా రిలీజ్..

ఇప్పటికే ప్రణయ గోదారి సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు.

Pranaya Godari Movie Song Released by Shekar Master

Pranaya Godari : పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో PL విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రణయగోదారి’. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించగా సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. గోదావరి ఒడ్డున ఓ ప్రేమకథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ సినిమా.

Also Read : Chandrababu Naidu : అన్‌స్టాప‌బుల్‌లో జైలు జీవితం గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఏడ్చేసిన ఆడియన్స్.. ప్రోమో వైరల్..

ఇప్పటికే ప్రణయ గోదారి సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘తెల్లారుపొద్దుల్లో..’ అంటూ సాగే ఈ మెలోడియస్ రొమాంటిక్ పాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటని మార్కండేయ రాయగా ఆయన సంగీత దర్శకత్వంలోనే ధనుంజయ్, అదితి భావరాజు పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

ఇక పాట రిలీజ్ చేసిన అనంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ప్రణయగోదారిలోని పాటను చూశాను. మా మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను షూట్ చేశారు అని అన్నారు.