×
Ad

Prasads Multiplex: ఓ టీషర్ట్‌ అదనంగా తెచ్చుకోండి.. ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ వినూత్న ప్రకటన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల సందర్బంగా అభిమానులు(Prasads Multiplex), ప్రేక్షకులు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Prasad's Multiplex makes strange announcement on OG release

Prasads Multiplex: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల సందర్బంగా అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో థియేటర్స్ లో ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. అరుపులు, విజిల్స్, డాన్సులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చొక్కాలు సైతం చించేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రముఖ మల్టీప్లెక్స్‌(Prasads Multiplex) సంస్థ ప్రసాద్‌ వినూత్న ప్రకటన చేసింది. ఓజీ సినిమా విషయంలో ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది టీ షర్ట్‌ చించుకుంటూ సినిమాని ఆస్వాదిస్తున్నారు. అందుకే ఈసారి సినిమాకి వచ్చేటప్పుడు అదనంగా ఓ టీ షర్ట్‌ తెచ్చుకోండి. మీకు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాటిక్‌ అనుభూతి అందించగలం. కానీ, దుస్తుల విషయంలో బాధ్యత వహించలేము కదా అంటూ” చమత్కరించేలా కీలక ప్రకటన చేసింది.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కు షాకిచ్చిన IRS అధికారి.. రూ.2 కోట్ల పరువునష్టం కేసు

దాంతో ఈ ప్రకటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా అదే రేంజ్ లో సినిమాను ఎంజాయ్ చేయాలంటే ఒక టీ షర్ట్ అదనంగా తీసుకుపోవడం మాత్రం మర్చిపోకండి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నీ సాధించింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న విడుదలై ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం ప్రీ సేల్స్ తోనే రూ.100 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.