Prasanth Varma Teja Sajja Hanuman Movie Collections Creates New Record in just 25 Days
Hanuman Collections : సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజయిన ‘హనుమాన్’ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించి ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది. సినిమా రిలీజయి 25 రోజులు దాటుతున్నా థియేటర్స్ లో హనుమాన్ సందడి చేస్తుంది.
ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేసిన హనుమాన్ సినిమా ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా 25 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆల్రెడీ సంక్రాంతికి రిలీజయిన సినిమాల్లో గత 92 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ హనుమాన్ సినిమా సాధించింది. చిన్న సినిమాగా రిలీజయి 300 కోట్ల కలెక్షన్స్ 25 రోజుల్లోనే అంటే ఇది పెద్ద రికార్డ్. కొంత మంది స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు కూడా 300 కోట్లకు ఎక్కువ రోజులే పట్టాయి.
Also Read : Upasana : నేను, చరణ్.. ఇద్దరం ఇక్కడే పుట్టాం.. మా ఇద్దరికీ ఈ సిటీ అంటే చాలా ఇష్టం.. ఏ సిటీనో తెలుసా?
హనుమాన్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక నార్త్ లో, అమెరికాలో కూడా దూసుకుపోతుంది. అమెరికాలో కూడా 5 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసి టాప్ 5 తెలుగు సినిమాగా నిలిచింది. ప్రస్తుతం చిత్రయూనిట్ అమెరికాలో సక్సెస్ టూర్ వేస్తున్నారు. సంక్రాంతి సినిమాలు అప్పుడే ఓటీటీ బాట పడుతుంటే హనుమాన్ మాత్రం ఇంకా థియేటర్స్ లో తన హవా చూపిస్తుంది. హనుమాన్ సినిమా మార్చ్ లో జీ5 ఓటీటీలోకి వస్తుందని సమాచారం.
The All-Time Sankranthi Blockbuster continues to create All Time Records?
A phenomenal 300Cr+ Worldwide Gross in 25 Days for #HanuMan and Continuing its glorifying run in all centres?
A @PrasanthVarma film
?ing @tejasajja123#HanuManEverywhere #HanuManRAMpage @Niran_Reddy… pic.twitter.com/1RUk3C38Wl— Primeshow Entertainment (@Primeshowtweets) February 6, 2024