Prasanth Varma Teja Sajja HanuMan movie first song release
HanuMan : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. అప్పుడెప్పుడో ఈ మూవీ నుంచి ఒక చిన్న టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేయడంతో.. చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తపడుతూ, కొంత ఎక్కువ సమయమే తీసుకుంటూ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడ మాట రాకూడదని మూవీ టీం పని చేస్తుంది. ఈ సినిమాని 2024 సంక్రాంతికి తీసుకు వస్తున్నామంటూ దర్శకుడుగా గట్టిగా చెబుతున్నారు.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మొదలు పెట్టారు. నేడు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా.. పిల్లలకి ఇష్టమైన ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ నుంచి సాంగ్ తో గిఫ్ట్ ఇచ్చారు. ‘సూపర్ హీరో హనుమాన్’ అంటూ సాగే ఈ పాటకి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించగా సాయి వేదం వాగ్దేవి, ప్రకృతి రెడ్డి, మయూఖ్ పాటని ఆలపించారు. ఈ లిరికల్ సాంగ్ ని కామిక్ టైపులో చూపించి పిల్లల్ని ఆకర్షించేలా చేశారు. మరి ఆ సాంగ్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Also read : Pongal 2024 : పొంగల్ రేసు నుంచి ఒక సినిమా అవుట్..! ఆ స్టార్ హీరో పరిస్థితి ఏంటి..?
కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ రావడం, ఆ తరువాత జరిగిన సంఘటనలు, ఆ కుర్రాడు ఎదుర్కొన్న విషయాలు ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఇండియన్ లాంగ్వేజ్స్ తో పాటు శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా వరల్డ్ వైడ్ గా మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.