Salaar : సలార్ నుంచి క్రేజ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. కానీ బ్యాడ్ న్యూస్..

సలార్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్. అయితే అదే అభిమానులకు బ్యాడ్ న్యూస్ లాంటిది.

Prashanth Neel gave crazy update on Prabhas Salaar but its a bad news

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైపెడ్ మూవీ ‘సలార్’. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్, నాలుగైదు పోస్టర్స్ తప్ప మరో క్రేజీ అప్డేట్ ఏం లేదు. ఈ మూవీ ట్రైలర్ ని డిసెంబర్ 1న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. తాజాగా ప్రశాంత్ నీల్ ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

రీసెంట్ గా హిందీ మీడియాతో ఇంటరాక్ట్ అయిన ప్రశాంత్ నీల్.. సలార్ కథ ఏంటి..? ‘కేజీఎఫ్’తో సలార్ కి కనెక్షన్ ఉందా..? అనే విషయాలను తెలియజేశారు. సలార్ కథ అంతా ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరుగుతుందట. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది సినిమా కథ అని తెలియజేశారు. కేజీఎఫ్ లాగానే యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ ‘ఉగ్రం’ కథతోనే సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Also read : Mahesh Babu : యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ కపూర్‌తో కలిసి మహేష్ బాబు డాన్స్..

ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు బట్టి చుస్తే అది నిజమే అని తెలుస్తుంది. అయితే ఉగ్రం కథలో ఫ్రెండ్స్ మధ్య పూర్తి స్థాయి శత్రుత్వం చూపించారు. సలార్ సినిమాలో ఫ్రెండ్స్ మధ్య గొడవనే మెయిన్ పాయింట్ గా తీసుకోని తెరకెక్కిస్తున్నారు. ఇక అభిమానులంతా సలార్ నుంచి ఆశిస్తుంది.. కేజీఎఫ్‌కి సలార్‌తో కనెక్షన్ ఉంటుందా అని. ఈ డౌట్ కి ప్రశాంత్ నీల్ బదులిస్తూ.. రెండు చిత్రాలకు ఏ కనెక్షన్ లేదని బ్యాడ్ న్యూస్ చెప్పారు.

సలార్ స్టాండ్ ఎలోన్ చిత్రంగా వస్తుందని, కేజీఎఫ్ కనెక్షన్ ఉంటుందని ఆశించకండి అంటూ ఆడియన్స్ కి తెలియజేశారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అని ఆశలు పెట్టుకున్న అభిమానుల్లో కొంత నిరాశ మొదలయింది. ఇక సెకండ్ పార్ట్ షూటింగ్ గురించి మాట్లాడుతూ.. “ఆ మూవీ షూటింగ్ గురించి ఇంకా ప్లాన్ చేయలేదు. కానీ త్వరలో అయితే మొదలు పెడతాము” అంటూ తెలియజేశారు. కేజీఎఫ్ చిత్రాన్ని రెండు పార్టులుగా అనుకోలేదని, కానీ సలార్ ని మాత్రం రెండు పార్టులుగానే మొదలుపెట్టినట్లు తెలియజేశారు.

 

ట్రెండింగ్ వార్తలు