prashanth neel said that he made same mistakes in salaar what he did already in kgf
Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపిస్తూ రూపొందిన చిత్రం సలార్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. పార్ట్ 1 డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీని థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక మూవీ టీం ఈ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది.
ఈక్రమంలోనే ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేజీఎఫ్‌కి చేసిన తప్పునే సలార్‌కి కూడా చేశానంటూ చెప్పుకొచ్చారు. “ఫైనల్ అవుట్ ఫుట్ ని చూసి, దానిలో ఏమన్నా మార్పులు చేయాలా అని చూసుకోలేని పరిస్థితి నాది. కేజీఎఫ్‌కి అలానే అయ్యింది, ఇప్పుడు సలార్ కి అలానే అయ్యింది. అయినాసరి ఆ ఫైనల్ అవుట్ ఫుట్ పై నేను ఆనందం గానే ఉన్నాను” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక మరో ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. సలార్ చిత్రం ‘గేమ్ అఫ్ థ్రోన్స్’లా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న టిన్ను ఆనంద్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ చిత్రాన్ని మహాభారతంతో పిలిచారు. పృథ్వీరాజ్ చెప్పిన గేమ్ అఫ్ థ్రోన్స్ అయినా, టిన్ను ఆనంద్ చెప్పిన మహాభారతం అయినా.. యుద్ధం జరిగింది సింహాసనం, రాజ్యం కోసమే. ఇప్పుడు సలార్ కూడా రాజ్యం కోసం, సింహాసనం కోసం జరిగే యుద్ధమే అని తెలుస్తుంది. ట్రైలర్ లో కూడా అదే కనిపించింది.