నిర్మాతతో నటుడి పెళ్లి పెటాకులు!

బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్, నిర్మాత సాన్యా సాగర్ వివాహ జీవితంలో కలతలు మొదలయ్యాయని బాలీవుడ్ టాక్..

  • Publish Date - April 2, 2020 / 08:44 AM IST

బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్, నిర్మాత సాన్యా సాగర్ వివాహ జీవితంలో కలతలు మొదలయ్యాయని బాలీవుడ్ టాక్..

లవ్, ఎట్రాక్షన్, పెళ్లి, విడాకులు, ప్రేమలో ఉండగానే బ్రేకప్.. పెళ్లైన కొద్దిరోజులకే డైవోర్స్.. పెళ్లై 15, 20 ఏళ్లవుతున్నా ఎదుగుతున్న పిల్లలున్నా సరే అభిప్రాయాలు కలవక, ఇద్దరి మధ్య మూడో మనిషి ఎంటరవడం వల్ల విడిపోయిన విడిపోతున్న సెలబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్‌లో ఈ టైప్ వ్యవహారాలు ఇటీవల కాస్త ఎక్కువయ్యాయి. తాజాగా నటుడు ప్రతీక్ బబ్బర్, అతని భార్య సాన్యా సాగర్‌ల కాపురం సజావుగా సాగడం లేదని, ఈ జంట కొద్దిరోజుల క్రితమే తమ రిలేషన్‌ను కట్టి కబోర్డ్‌లో పడేసారని బాలీవుడ్ వర్గాల సమాచారం.

అయితే బాలీవుడ్ నిర్మాత సన్యా సాగర్‌తో తన వివాహ బంధంలో కలతలు మొదలయ్యాయంటూ వస్తున్న వార్తలను నటుడు ప్రతీక్‌ బబ్బర్‌ ఖండించాడు. 2019 జనవరిలో పెళ్లి చేసుకున్న సన్యా, ప్రతీక్‌లు గత కొద్ది రోజులుగా విడిగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రతీక్‌ కుటుంబ వేడుకల్లో సన్యా లేకపోవడం… సన్యా సినిమా వేడుకలకు, పార్టీలకు ప్రతీక్‌ను ఆహ్వానించకపోవడం చూసి వీరిద్దరూ విడిపోయారంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపించాయి.

ప్రతీక్ మొహమాటానికి మేమిద్దరం బాగానే ఉన్నాం..మా మధ్య ఏం జరగలేదు అని చెబుతున్నా.. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరూ ఫాలో కాకపోవడం, అలాగే వారిద్దరికి సంబంధించిన (కలసి ఉన్న) ఫోటోలను ఇన్‌స్టా నుంచి తొలగించడం చూస్తుంటే.. నిప్పు లేనిదే పొగ రాదు.. తాజాగా వస్తున్న వార్తల్లో కచ్చితంగా నిజం ఉండే ఉంటుంది అనే మాటలు కూడా వినబడుతున్నాయి. ప్రతీక్ బబ్బర్ ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాలో నటించాడు.
Read Also : ప్రియుడితో లేటు వయసు భామ ఘాటు రొమాన్స్