×
Ad

Predator: Badlands: ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అండ్ విజువల్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రెడేటర్.. ఈ సిరీస్ నుంచి వచ్చే సినిమాలకు ఆడియన్స్ లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు(Predator: Badlands). 1987లో వచ్చిన ఈ సినిమాలో హోలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ హీరోగా కనిపించారు.

Predator: Badlands final trailer released

Predator: Badlands: ప్రెడేటర్.. ఈ సిరీస్ నుంచి వచ్చే సినిమాలకు ఆడియన్స్ లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. 1987లో వచ్చిన ఈ సినిమాలో హోలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ హీరోగా కనిపించారు. దర్శకుడు జాన్ మెక్ టీర్నన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా(Predator: Badlands) భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ప్రెయ్, సీక్వెల్ గా ప్రెడేటర్ 2 సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

Naga Chaitanya: తనను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశాను.. అప్పటికే తను.. భార్య గురించి చెప్తూ సిగ్గుపడిపోయిన చైతూ

తాజాగా ప్రెడేటర్ సినిమాకు మరో సీక్వెల్ వస్తోంది. అదే ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్. ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను డైరెక్టర్ డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫైనల్ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌లో విజువల్స్, ఎక్స్‌ప్లోసివ్ సెట్ పీసెస్, ప్రెడేటర్ వర్సెస్ ప్రెడేటర్ యాక్షన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. దీంతో, సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏర్పడే మోస్ట్ డేంజరస్ ప్లానెట్ పై ఈ సినిమా సెట్ చేయబడింది. తన క్లాన్ నుంచి బహిష్కరించబడిన యంగ్ ప్రెడేటర్ కు, హాఫ్-డిస్ట్రాయ్డ్ ఆండ్రాయిడ్ థియా పరిచయం ఏర్పడుతుంది. ఈ ఇద్దరూ కలిసి అల్టిమేట్ అడ్వర్సరీని వెతుకుతూ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురయ్యే సరికొత్త, భయానకమైన పరిస్థితులే ఈ సినిమాగా రూపొందించారు. 20th సెంచరీ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్‌ సినిమా నవంబర్ 7న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.