Naga Chaitanya: తనను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశాను.. అప్పటికే తను.. భార్య గురించి చెప్తూ సిగ్గుపడిపోయిన చైతూ

అక్కినేని నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (Naga Chaitanya)దాదాపు రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా కొనసాగుతున్నారు.

Naga Chaitanya: తనను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశాను.. అప్పటికే తను.. భార్య గురించి చెప్తూ సిగ్గుపడిపోయిన చైతూ

Naga Chaitanya makes interesting comments about his wife Shobhita

Updated On : October 7, 2025 / 5:24 PM IST

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా కొనసాగుతున్నారు. అయితే, పెళ్లి తరువాత ఎక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనని నాగ చైతన్య(Naga Chaitanya) తన భార్య గురించి కూడా ఎక్కడా చెప్పే అవకాశం రాలేదు. తాజాగా ఆయన జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ లో హాజరయ్యారు. ఈ షోలో ఆయన తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్ లైఫ్ గురించి ముఖ్యంగా తన భార్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Kamal-Rajini: కమల్-రజినీ మల్టీస్టారర్.. డైరెక్టర్ నేను కాదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

“నేను నా భార్యను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో కలుస్తానని అస్సలు ఊహించలేదు. తన వర్క్ గురించి నాకు బాగా తెలుసు. ఒకరోజు నేను నా క్లౌడ్ కిచన్ గురించి పోస్ట్ పెట్టినప్పుడు తను ఒక ఎమోజీని కామెంట్ చేసింది. అప్పుడే నేను తనతో చాట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఒకసారి కలిశాము(నవ్వుతూ)”అంటూ చెప్పుకొచ్చాడు చై. అలాగే, ఎవరిని విడిచి నువ్వు ఉండలేవు అని హోస్ట్ జగపతిబాబు అడగగా.. “శోభితా మై వైఫ్.. తనే నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ సపోర్ట్” అంటూ సమాధానం చెప్పాడు . దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో సినిమా చేస్తున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. విరూపాక్ష లాంటి సూపర్ సక్సెస్ తరువాత దర్శకుడు కార్తీక్ వర్మ నుంచి వస్తున్న సినిమా కావడం, నాగ చైతన్య హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియోకి ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.