Kamal-Rajini: కమల్-రజినీ మల్టీస్టారర్.. డైరెక్టర్ నేను కాదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

తమిళ ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్ కి రంగం సిద్దమైన విషయం తెలిసిందే(Kamal-Rajini). సూపర్ స్టార్ రజనీకాంత్-లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు.

Kamal-Rajini: కమల్-రజినీ మల్టీస్టారర్.. డైరెక్టర్ నేను కాదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Director Pradeep Ranganathan's shocking comments on Kamal-Rajini multistarrer movie

Updated On : October 7, 2025 / 4:55 PM IST

Kamal-Rajini: తమిళ ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్ కి రంగం సిద్దమైన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్-లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. ఇటీవల జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ ప్రాజెక్టు గురించి స్వయంగా కమల్ హాసన్(Kamal-Rajini) చెప్పుకొచ్చాడు. త్వరలోనే మేము కలిసి సినిమా చేయబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అప్పటినుంచి ఈ ప్రాజెక్టు కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ భారీ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

Arasan: వెట్రిమారన్ సినిమాటిక్ యూనివర్స్.. శింబు హీరోగా ‘అరసన్’ మూవీ.. అంటే అర్థం ఏంటో తెలుసా?

తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే. కమల్-రజిని సినిమాను ముందుగా దర్శకుడు లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తాడని వార్తలు వినిపించాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా రాబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ న్యూస్ పై అటు హీరోలు కానీ, ఇటు దర్శకుడు లోకేష్ గానీ ఎక్కడ ప్రకటన చేయలేదు. దీంతో, ఆ న్యూస్ రూమర్ గానే ముగిలిపోయింది. ఇక తాజాగా, మరో కుర్ర దర్శకుడి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. దాంతో, ఆ దర్శకుడు స్వయంగా ఈ ప్రెస్టీజియస్ గురించి చెప్పుకొచ్చాడు.

ఆ దర్శకుడు మరెవరో కాదు ప్రదీప్ రంగనాథన్. ఈ దర్శకుడు లవ్ టుడే సినిమాతో హీరోగా మారాడు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హీరోగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్.. ప్రస్తుతం డ్యూడ్ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ హీరో రజినీకాంత్-కమల్ హాసన్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “ఈ సినిమాకు ఆఫర్ నాకు వచ్చిందో లేదో చెప్పను. కానీ, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం డైరెక్షన్ కంటే యాక్టింగ్‌ మీదే ఫోకస్‌ పెట్టాలని అనుకుంటున్నాను. కాబట్టి, కమల్‌-రజనీకాంత్‌ ప్రాజెక్టు గురించి ఇంతకంటే చెప్పలేను”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రదీప్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.