Speed 220 : ‘స్పీడ్ 220’ మూవీ రివ్యూ.. ఇద్దరు అబ్బాయిలతో అమ్మాయి బోల్డ్ లవ్ స్టోరీ..

యూత్ ని అట్రాక్ట్ చేయడానికి తెరకెక్కించిన రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ స్పీడ్ 220 సినిమా.

Preeti Sundar Speed 220 Movie Review and Rating

Speed 220 Movie Review : గణేష్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘స్పీడ్ 220’. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్త నిర్మాణంలో హర్ష బీజగం దర్శకత్వంలో ఈ స్పీడ్ 220 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. సూర్య(హేమంత్), చందు(గణేష్) మంచి ఫ్రెండ్స్. ఊళ్ళో భిక్షపతి(తాటికొండ మహేంద్రనాథ్) అనే ఓ జమీదారు ఇంట్లో పనిచేస్తూ అందరికి సహాయంగా ఉంటారు. జమిందార్ కూతురు మాయ(ప్రీతి సుందర్) కూడా చిన్నపట్నుంచి సూర్య, చందులతో స్నేహం చేస్తుంది. ముగ్గురు కలిసే చదువుకుంటూ పెద్దవాళ్లవుతారు. అయితే మాయ.. సూర్య, చందులతో ఒకరికి తెలియకుండా ఒకరితో సాన్నిహిత్యంగా ఉంటుంది. సూర్యకు బాగా దగ్గరైన ఊళ్ళో ఉండే చింటూ అనే కుర్రాడు అనుకోకుండా చనిపోతాడు. ఆ తర్వాత మాయ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది.

మాయ చనిపోవడంతో సూర్య పిచ్చివాడిలా తిరుగుతూ ఉండగా అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. అసలు చింటూ, మాయలు ఎలా చనిపోయారు? మాయ ఇద్దరితో సాన్నిహిత్యంగా ఉందని ఇద్దరికీ తెలుస్తుందా? సూర్య మీద హత్య ప్రయత్నం ఎవరు చేశారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Bigg Boss 8 Promo : హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన సీత.. నేనే గిన్నెలు తోమాల్నా..?

సినిమా విశ్లేషణ.. ఇటీవల యూత్ ని ఆకర్షించడానికి రొమాన్స్, లవ్ కంటెంట్ ఎక్కువ సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ స్పీడ్ 220 సినిమా చూస్తుంటే RX100 సినిమా ఛాయలు కనిపిస్తాయి. మోడ్రన్ గా ఇష్టమొచ్చినట్టు ఉండాలి అనుకునే హీరోయిన్, ఆమె ప్రేమ కోసం పరితపించే ఇద్దరు నిజాయితీ గల కుర్రాళ్ళు కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. రెగ్యులర్ కథే అయినా కొత్త కథాంశంతో చూపించారు.

ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, ఇద్దరు హీరోలు – హీరోయిన్ మధ్య సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ తో సాగుతుంది. సినిమాలో హీరోయిన్ తో రొమాన్స్ సీన్స్ ఎక్కువే ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ మాస్ యాక్షన్ సన్నివేశాలు, కాస్త ఎమోషన్ తో సాగుతుంది. సినిమా నిడివి తక్కువ ఉండటం, ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాని నడిపించడంతో ఈ బోల్డ్ లవ్ స్టోరీ బాగానే అనిపిస్తుంది. అయితే చిన్నప్పట్నుంచి బాగానే పెరిగిన అమ్మాయి ఒకేసారి అంత మోడ్రన్ గా ఎందుకు మారుతుందో ప్రేక్షకులని కన్విన్స్ చేయలేకపోయారు. యూత్ ని అట్రాక్ట్ చేయడానికి తెరకెక్కించిన రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ స్పీడ్ 220 సినిమా అని చెప్పొచ్చు. ఎక్స్‌ట్రాగా ఓ ఐటెం సాంగ్ బోనస్.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ముఖ్యంగా ఈ సినిమాలో మాయ పాత్రలో చేసిన ప్రీతీ సుందర్ గురించి చెప్పుకోవాలి. బోల్డ్ పాత్రలో రొమాంటిక్ సీన్స్ తో పాటు నటనలో అదరగొట్టేసింది చెప్పొచ్చు. భగ్న ప్రేమికుడిగా హేమంత్ మెప్పిస్తాడు. గణేష్, జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్, చింటూ పాత్రలో చేసిన కుర్రాడు.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు మాత్రం యావరేజ్. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో జరగడంతో లొకేషన్స్ మాత్రం బాగా చూపించారు. ఇక పాత కథే అయినా ఇద్దరు యువకులు, ఒక అమ్మాయి మధ్య ట్రయంగిల్ కథనంలా కొత్తగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. మొదటి సినిమానే అయిన దర్శకుడిగా హర్ష సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా సినిమాకి కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు