‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. సెకండ్ స్టెప్ – పూజా హెగ్డే లుక్ రిలీజ్..
యంగ్ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు, వాసు వర్మ (జోష్ దర్శకుడు) కలిసి నిర్మిస్తున్న మూవీ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’..
ఇటీవల ఫస్ట్ స్టెప్ అంటూ విడదుల చేసిన అఖిల్ అక్కినేని లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పడు సెకండ్ స్టెప్ అంటూ వాలెంటైన్స్ డే నాడు పూజా హెగ్డే లుక్‌ని విడుదల చేశారు. ఈ మూవీలో పూజా ‘విభా’ పాత్రలో కనిపించనుంది. ఇలా స్టెప్స్ అంటూ ఆడియన్స్‌లో ఫ్యాన్స్‌లో ఈ చిత్రం పై క్యూరియాసిటి మరింత పెంచుతున్నారు మూవీ టీమ్.
ఈ రెండు లుక్‌లు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం ఈ సినిమాపై ప్రేక్షకులకున్న అంచనాలు తెలియజేస్తుంది. అఖిల్‌కి ఈ సినిమా కెరీర్ బెస్ట్ కానుంది. ‘బొమ్మరిల్లు’ చిత్రం విడుదలై ఇన్ని సంవత్సరాలయినా కూడా ఇప్పటికీ బొమ్మరిల్లు చిత్రంలోని సంభాషణలు కాని, సన్నివేశాలు కాని డిస్కషన్‌లో వున్నాయంటే ఆ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ అలాంటిది.. ఆ చిత్ర దర్శకుడు భాస్కర్ కొంత గ్యాప్ తరువాత మరోసారి పది సంవత్సరాలపాటు మాట్లాడుకునేలా చిత్ర కధ కుదిరిందని యూనిట్ అంటున్నారు.
అదే విధంగా ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గొవిందం’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో కెరీర్ బెస్ట్ గ్రాసర్‌గా రికార్డు విజయాల్ని అందించిన బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రత్యేక శ్రధ్ధతో నిర్మిన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ : గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ, ఎడిటర్ : మార్తండ్ కె వెంకటేశ్,
ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా, నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ, సమర్పణ : అల్లు అరవింద్, బ్యానర్ : జీఏ2 పిక్చర్స్.
Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!