విశ్వనటుడు కమల్ హాసన్ తన కాలిలో ఉన్న ఇంప్లాంట్‌ను తొలగించుకోవడానికి సర్జరీ నిమిత్తం నవంబర్ 22న హాస్పిటల్‌లో అడ్మిట్ అవనున్నారు..
విశ్వనటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు డాక్టర్స్ శుక్రవారం ఆయనకు సర్జరీ చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.
‘2016 లో జరిగిన ప్రమాదంలో కమల్ కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, ఇప్పుడు దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్‌ను వాయిదా వేస్తూ వచ్చారని’ ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ తెలిపారు. డాక్టర్స్ సలహా మేరకు రేపు (నవంబర్ 22) కమల్ హాసన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు.
Read Also : ‘జవానీ జానేమన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆపరేషన్ తర్వాత ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని మహేంద్రన్ వెల్లడించారు. ప్రస్తుతం కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Press Release regarding Nammavar surgical treatment.#Nammavar #MakkalNeedhiMaiam pic.twitter.com/taPoUG6yIX
— Dr Mahendran R (@drmahendran_r) November 21, 2019