Prince Kali Trailer out now
Kali Trailer : టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న మూవీ కలి. శివ శేషు దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలి ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ట్రైలర్‌ను బట్టి గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా మూవీ ఉండబోతుందని అర్థమవుతోందన్నారు. అందరూ చాలా బాగా నటించారన్నారు.
Game Changer : రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రెండో సాంగ్ పోస్టర్ చూశారా?
మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని పుడతాడు. దాని మీద గెలిచిన వాడే గొప్పవాడు అవుతాడు అంటూ ప్రిన్స్ చెప్పే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు ప్రిన్స్. ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక ప్రిన్స్ జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.