Prithviraj Sukumaran AADUJEEVITHAM trailer release The Goat Life
Prithviraj Sukumaran : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటుడిగా, డైరెక్టర్ గా, రైటర్ గా, సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా ఈ నటుడు ఇతర ఇండస్ట్రీలో కూడా క్రేజ్ ఛాన్సులు అందుకుంటూ బిజీ బిజీగా మారిపోయాడు. కాగా ఇటీవల పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ అనే సినిమాలో నటించాడు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
Preity Zinta : ప్రీతి జింటాకి చేదు అనుభవం.. రియాక్ట్ అయిన ప్రియాంక చోప్రా , హృతిక్ రోషన్!
తెలుగులో ‘ఆడుజీవితం’ అనే పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సినిమా కథ విషయానికి వస్తే.. కేరళకి సంబంధించిన పృథ్వీరాజ్ ఉద్యోగం చేయడానికి కోసం సౌదీ అరేబియాకి వెళ్తాడు. ఈ క్రమంలోనే దుబాయ్ ఎడారిలో మేకల కాపరిగా పనిలో చేరుతాడు. అయితే అక్కడి వారు తనని ఒక బానిసగా చూడడం మొదలు పెడతారు. ఎన్నో సమస్యలు ఎదురుకుంటాడు. దీంతో అక్కడి నుంచి ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం నిర్ణయించుకొని ఎడారి ప్రయాణం మొదలు పెడతాడు. ఎడారిలో ఎలాంటి సమస్యని ఎదురుకున్నాడో, చివరికి తన ప్రాణాలతో ఇండియా చేరుకున్నాడా? లేదా? అన్నదే సినిమా కథ అని తెలుస్తుంది.
Raviteja : బాలీవుడ్‌లో రవితేజ మల్టీస్టారర్.. నిజమేనా?
నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. అమలాపాల్ ఫిమేల్ లీడ్ చేస్తుంది. ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. బ్లెస్సీ, కెజీ అబ్రహం, జిమ్మీ జీన్ లూయిస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఈ తరహా కథాంశంతో వచ్చిన లైఫ్ అఫ్ ఫై (Life of PI) సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందా? లేదా? చూడాలి.