×
Ad

SSMB29: ఈవెంట్ కి ముందు సూపర్ సర్ ప్రైజ్.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ఇవాళే.. ఏ టైంకి అంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కోసం యావత్(SSMB29) ఇండియా అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది.

Prithviraj Sukumaran first look will be released today from ssmb29

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కోసం యావత్ ఇండియా అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, మహేష్ బాబు హీరోగా అవడంతో సినిమాపై(SSMB29) అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇక హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గ్లొబ్ ట్రాటర్ టాగ్ తో ఇప్పటికే ఈ సినిమాను వరల్డ్ వైడ్ టట్రెండ్ చేస్తున్నాడు రాజమౌళి.

Bhagyashri Borse: రానాకి నేను నచ్చలేదు.. నా యాక్టింగ్ పై అనుమానాలు.. అన్నీ చేశాకే..

ఆ హైప్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళుతూ నవంబర్ 15న భారీ ఈవెంట్ జరుపనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి ఏర్పాట్లు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో సినిమా టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ తోపాటు టీజర్ కూడా విడుదల చేయనున్నారు అని సమాచారం. అయితే, ఈ ఈవెంట్ కి ముందే ఆడియన్స్ కి మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు రాజమౌళి. ఇవాళ అంటే నవంబర్ 7 ఈ సినిమా నుంచి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.

ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. “ఓపక్క సినిమా క్లైమాక్స్‌ షూట్‌ జరుగుతోంది. మరోవైపు ఈవెంట్‌ కోసం పనులు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఈ ఈవెంట్ జరుగనుంది. నవంబర్‌ 15న మీరంతా చాలా ఎంజాయ్‌ చేస్తారు. నేను కూడా ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను. దానికంటే ముందు ఈ వారమంతా మీరు హుషారుగా ఉండేందుకు ఇవాళ(నవంబర్ 7) పృథ్వీరాజ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల కాబోతుంది”అంటూ రాసుకొచ్చాడు రాజమౌళి. దీంతో, అనుకోకుండా వస్తున్న ఈ అప్డేట్ తో ఆడియన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.