Prithviraj Sukumaran, Manju Warrier Reacts on Kerala actress sexual assault case
Kerala Actress Case: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం మలయాళ ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ నటిని కొంతమంది ఆకతాయిలు లైగిక వేధింపులకు గురి చేశారు. ఆ కేసు కోర్టుకు వెళ్లడంతో పెండింగ్ లపైనా పెండింగులు పడుతూ వస్తోంది. కానీ, బాధిత నటి మాత్రం(Kerala Actress Case) వెనుకడుగు వేయలేదు. న్యాయం కోసం తన పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈ కేసు కొలిక్కి వచ్చింది. నిందితులకు ఎర్నాకుళం సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. దీంతో బాధిత నటి ఆనందం వ్యక్తం చేసింది.
Shriya Saran: తల్లైనా తగ్గేదే లే.. గ్లామర్ డోస్ పెంచేసిన స్టార్ బ్యూటీ శ్రియా.. ఫోటోలు
అదే విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.. “ఇది 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ఈ ప్రయాణం. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగినట్టుగా అనిపిస్తోంది”అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నటి చేసిన ఈ పోస్ట్ కి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్ట్ అయ్యాడు. ఆమె చేసిన పోస్ట్ కు రిప్లై ఇస్తూ దండం పెట్టె ఎమోజీని యాడ్ చేశాడు. అంతేకాదు, మలయాళ నటి మంజు వారియర్ కూడా బాధిత నటి పోస్ట్ కి రియాక్ట్ అయ్యింది. ఇక తాజాగా వచ్చిన తీర్పుతో బాధిత నటి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.