×
Ad

Prithviraj Sukumaran : వేరే పరిశ్రమల రెమ్యునరేషన్స్‌పై పృథ్విరాజ్ సంచలన వ్యాఖ్యలు.. మా సినిమాలు అందుకే బాగుంటాయి..

పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

  • Published On : March 24, 2024 / 03:15 PM IST

Prithviraj Sukumaran Sensational Comments on Other Industries Remunerations

Prithviraj Sukumaran : మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. మలయాళంలో సూపర్ ఫామ్ లో హీరోగా సినిమాలు చేస్తూనే వేరే పరిశ్రమల్లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు పృథ్విరాజ్ సుకుమారన్. త్వరలో ‘ఆడు జీవితం : ది గోట్ లైఫ్'(Aadu Jeevitham The Goat Life) అనే సినిమాతో రాబోతున్నాడు.

ఆడు జీవితం : ది గోట్ లైఫ్ సినిమా పాన్ ఇండియా వైడ్ మార్చ్ 28 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం పృథ్విరాజ్ సుకుమారన్ దాదాపు ఆరేళ్ళు కష్టపడ్డాడు. ఓ వ్యక్తి ఎడారిలో తప్పిపోతే ఎలా బయటకు వచ్చాడు అనే కథాంశంతో సర్వైవల్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం పృథ్విరాజ్ సుకుమారన్ దాదాపు 31 కిలోలు బరువు తగ్గి, కొన్ని సినిమాలని వదిలేసుకొని.. కష్టపడ్డాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలయాళ సినిమాల గురించి, రెమ్యునరేషన్స్ గురించి, వేరే పరిశ్రమల రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడారు.

ఇంటర్వ్యూలో యాంకర్.. మలయాళంలో మీరు తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు చేసి మంచి హిట్ కొడతారు. అదెలా సాధ్యం అని అడిగారు. దానికి పృథ్విరాజ్ సుకుమారన్ సమాధానమిస్తూ.. వేరే సినీ పరిశ్రమలలో రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక సినిమాకి 75 కోట్లు పెడితే అందులో 55 కోట్లు రెమ్యునరేషన్స్ కే పెడతారు. మేకింగ్ కి కేవలం 20 కోట్లు మాత్రమే పెడతారు. కానీ మా దగ్గర సినిమా మేకింగ్ కి ఎక్కువ ఖర్చు చేస్తారు. మా రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉండవు. నేను చాలా సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోను. సినిమా మీదే ఖర్చు పెట్టమంటాను. సినిమా హిట్ అయితే ప్రాఫిట్స్ లోంచి షేర్ తీసుకుంటాను. అందుకే మా సినిమాలు బాగుంటాయి. అలా అని మా సినిమాలే బాగుంటాయి అని నేను చెప్పను. ఇటీవల మలయాళం సినిమాలకు మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఇదే అని తెలిపారు.

Also Read : Emraan Hashmi : OG నుంచి ‘ఓమి భాయ్’ వచ్చేసాడు.. పవన్ హీరోయిజానికి తగ్గ విలన్..

దీంతో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలే మన దగ్గర మా హీరో ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, అంత తీసుకుంటున్నాడు అని హడావిడి చేస్తారు అభిమానులు. పృథ్విరాజ్ సుకుమారన్ ఇలా చెప్పడంతో పలువురు విమర్శలు చేస్తుంటే, కొంతమంది మాత్రం ఇదే కరెక్ట్ అని అభినందిస్తున్నారు.