Emraan Hashmi : OG నుంచి ‘ఓమి భౌ’ వచ్చేసాడు.. పవన్ హీరోయిజానికి తగ్గ విలన్..

తాజాగా నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు కావడంతో OG సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ రిలీజ్ చేసారు మూవీ యూనిట్.

Emraan Hashmi : OG నుంచి ‘ఓమి భౌ’ వచ్చేసాడు.. పవన్ హీరోయిజానికి తగ్గ విలన్..

Emraan Hashmi Poster Released from Pawan Kalyan They Call Him OG Movie

Emraan Hashmi : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ముంబైలో డాన్ పాత్రలో పవన్ కనిపించబోతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ గ్లింప్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులని ఖుషి చేసారు. ఎన్నికల హడావిడి ఉండటంతో పవన్ ప్రస్తుతానికి ఈ సినిమాని పక్కన పెట్టారు. కానీ ఇంకొక్క షెడ్యూల్ పవన్ డేట్స్ ఇస్తే ఈ సినిమా అయిపోతుంది. సెప్టెంబర్ 27న పవన్ OG సినిమా రిలీజ్ చేయబోతున్నాం అని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది.

OG సినిమాలో శ్రియారెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, తేజ్ సప్రూ.. ఇలా చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు కావడంతో OG సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఇందులో ఇమ్రాన్ చాలా సీరియస్ గా సిగరెట్ వెలిగిస్తూ ఉన్నాడు. పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ఓమి భౌ అని రాసుంది. దీంతో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమి భౌగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

Also Read : Om Bheem Bush Collections : అదరగొట్టిన శ్రీవిష్ణు.. ‘ఓం భీమ్ బుష్’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా సినిమాలు చేసిన ఇమ్రాన్ హష్మీ గత కొన్నాళ్లుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) OG సినిమాతో పాటు, అడివిశేష్ గూడాచారి 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ఇమ్రాన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ అభిమానులు కూడా ఓమి భాయ్ కి హ్యాపీ బర్త్ డే అని చెప్తూ పవన్ హీరోయిజానికి పర్ఫెక్ట్ విలన్ లా కనిపిస్తున్నాడని పోస్టర్ చూసి కామెంట్స్ చేస్తున్నారు.