Priya Marathe : బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ టీవీ నటి ప్రియా మరాఠే నేడు ఉదయం మరణించింది. ప్రియా మరాఠే గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతుంది. మొదట క్యాన్సర్ రావడంతో యాక్టింగ్ కి గ్యాప్ తీసుకున్న ప్రియా కాస్త తగ్గింది అనుకున్న తర్వాత మళ్ళీ వర్క్ కి వెళ్ళింది.(Priya Marathe)
కానీ మళ్ళీ క్యాన్సర్ పెరగడంతో ప్రియా మరాఠే ట్రీట్మెంట్ చేయించుకుంటూ నేడు ఆగస్టు 31 ఉదయం ముంబైలో తన ఇంట్లోనే మరణించింది. దీంతో బాలీవుడ్ టీవీ ప్రముఖులు, ఆమె ఫ్యాన్స్ నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : Nani : నాని ఫేవరేట్ టీచర్ ఎవరో? నాని గురించి ఏం చెప్పారో తెలుసా?.. టెన్త్ క్లాస్ లోనే..
ప్రియా మరాఠే దాదాపు 20 కి పైగా సీరియల్స్ లో నటించింది. 2006 నుంచి టీవీ పరిశ్రమలో ఉంది. రెండు సినిమాలలో కూడా నటించింది. 2012 లో ఓ సీనియర్ నటుడు కొడుకుని వివాహం చేసుకుంది. ఇలా 38 ఏళ్ళ వయసులోనే ప్రియా మరాఠే క్యాన్సర్ తో మరణించడంతో ఆమె కుటుంబంలో, టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది.