Nani Father : నాన్న బిజినెస్ లు చేసి ఫెయిల్ అయ్యారు.. నాన్న, నేను అందరం అమ్మ మీదే ఆధారపడ్డాం.. నాని ఎమోషనల్..
తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా రావడంతో ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు.(Nani Father)

Nani Father
Nani Father : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి బాగా సక్సెస్ అయి స్టార్ హీరోలు అయినవాళ్ళల్లో నాని ఒకరు. మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఇప్పుడు నాని స్టార్ హీరో అయి కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు.(Nani Father)
తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా రావడంతో ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి మాట్లాడారు.
నాని మాట్లాడుతూ.. నాన్న గోదావరి ఫెర్టిలైజర్స్ లో జాబ్ చేసే వాళ్ళు. ఆ జాబ్ మానేసి చిన్న చిన్న బిజినెస్ లు పెట్టారు, అవి వర్కౌట్ అవ్వలేదు. కానీ మా ఇంటికి ఆధారంగా అమ్మ ఉండేది. అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ CGHS లో ఫార్మసిస్ట్. అమ్మ జాబ్ వల్ల నాన్న బిజినెస్ లు చేసి ఫెయిల్ అయినా ఇంట్లో గడిచిపోయేది. ఇల్లు గడవడానికి ఒకానొక సమయంలో అమ్మే కారణం. నాన్న కూడా ఒకానొక టైంలో అమ్మ మీద ఆధారపడ్డారు.
నేను, అక్క కూడా అమ్మ మీద ఆధారపడ్డాం. నాన్న చాలా కష్టపడ్డారు, ఏదో ట్రై చేయాలి అని చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. నాన్న అందర్నీ బాగా నమ్మేసి మోసపోయారు. అమ్మతో కూడా కొన్ని సంతకాలు పెట్టించి చాలా ఎఫెక్ట్ అయ్యారు. మా అమ్మ అందుకే నాన్న మీద కంప్లైంట్ చేసేది పిల్లలకు ఏం చేయలేదు అని. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల పిల్లలు మేము బాగానే ఉన్నాం. నాన్న అందరికి హెల్ప్ చేయాలనే ఆలోచన వల్లే మాకు మంచి జరిగిందేమో అనుకుంటాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.