Anjali Raghav : స్టేజిపై అందరి ముందు ఆమె నడుము పట్టుకొని.. హీరో మిస్ బిహేవియర్.. ఇకపై అక్కడ పని చేయను అంటూ నటి ఆవేదన..
అంజలి రాఘవ్ ఈ ఘటనపై స్పందిస్తూ రెండు వీడియోలు షేర్ చేసింది. ఈ వీడియోలో అంజలి రాఘవ్ మాట్లాడుతూ..(Anjali Raghav)

Anjali Raghav
Anjali Raghav : తాజాగా ఓ సింగర్ స్టేజిపై ఓ నటి నడుము పట్టుకొని మిస్ బిహేవ్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఆ నటి ఎమోషనల్ అవుతూ వీడియో షేర్ చేసింది. భోజ్ పురి ప్రైవేట్ సాంగ్స్ బాగా పాపులర్ అని తెలిసిందే. భోజ్ పురి సింగర్, నటుడు పవన్ సింగ్ సినిమాల్లో హీరోగా, బయట ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఇటీవల హర్యానాకు చెందిన అంజలి రాఘవ్ తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేసాడు.(Anjali Raghav)
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అంజలి రాఘవ్ మాట్లాడుతుంటే పవన్ సింగ్ ఆమె నడుమును పట్టుకొని, ఆమె నడుముకు ఏదో అంటుకుంది అన్నట్టు ఆమె నడుముని తాకి స్టేజిపై అందరి ముందు మిస్ బిహేవ్ చేసాడు. అయితే అప్పుడు అంజలి నవ్వుతూనే సరదాగా ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా అతను అలా నడుముని తాకి మిస్ బిహేవ్ చేస్తుంటే నవ్వుతారేంటి అని ఆమెపై విమర్శలు వచ్చాయి.
అంజలి రాఘవ్
దీంతో అంజలి రాఘవ్ ఈ ఘటనపై స్పందిస్తూ రెండు వీడియోలు షేర్ చేసింది. ఈ వీడియోలో అంజలి రాఘవ్ మాట్లాడుతూ.. ఆ సంఘటనతో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అందరూ నన్ను అతన్ని ఎందుకు కొట్టలేదు? అతన్ని ఏం చేయలేదు ఎందుకు అని అడుగుతున్నారు. కొంతమంది నేను నవ్వుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అని కూడా అన్నారు. పబ్లిక్ లో అలా టచ్ చేయడం నేను ఎంజాయ్ చేస్తానా? పవన్ సింగ్ నా నడుము దగ్గర ఏదో ఉంది అని అన్నాడు. నేను ఏదైనా నా డ్రెస్ ట్యాగ్ అయి ఉంటుంది లైట్ అని చెప్పాను. కానీ అతను మళ్ళీ అదే చెప్పి నా నడుము మీద చేతులు వేసాడు.
తర్వాత నేను నా టీమ్ ని అడిగాను నా నడుము మీద ఏమైనా ఉందా చూశారా అంటే వాళ్ళు లేదు అని చెప్పారు. అప్పుడు నాకు కోపం వచ్చింది, ఏడ్చేసాను. కానీ అప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. అక్కడున్న వాళ్లంతా అతని ఫ్యాన్స్. తర్వాత ఈ విషయం గురించి అతని టీమ్ ని కాంటాక్ట్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఏ అమ్మాయిని అయినా పర్మిషన్ లేకుండా టచ్ చేయడం తప్పు. ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల నేను చాలా బాధపడ్డాను. నేను ఇకపై భోజ్ పూరి ఇండస్ట్రీలో పనిచేయను. ఆ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నాను అని తెలిపింది.
Also See : Siree Lella : కాబోయే భార్యతో నటించిన నారా రోహిత్.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసి స్పెషల్ పోస్ట్..
అయితే పవన్ సింగ్ ఈ ఘటన గురించి ఏమి స్పందించలేదు కానీ తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి.. పెయిన్ అనుభవిస్తున్నవాళ్లకే దాని గురించి తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎవరికీ ఆ పెయిన్ గురించి అర్ధం కాదు అని పోస్ట్ చేసాడు.