Aha Movies : బ్యాక్ టు బ్యాక్ ఆహా ఓటీటీలో రెండు సినిమాలు..

ఆహాలో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ స్ట్రీమింగ్ కానున్నాయి.

Priyadarshi and Tovino Thomas Movies Streaming in Aha OTT Here Details

Aha Movies : తెలుగు ఓటీటీ ఆహాలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు వస్తున్న సంగతి తెలిసిందే. పలు డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆహాలో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ స్ట్రీమింగ్ కానున్నాయి.

Also Read : Upasana – Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ సాంగ్‌తో చరణ్ – ఉపాసన క్యూట్ వీడియో ఎడిట్ చేసిన ఫ్యాన్.. ఉపాసన రిప్లై.. వీడియో వైరల్..

ప్రియదర్శి నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ సినిమా నేడు నవంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నారాయణ చెన్నా దర్శకత్వంలో నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది.

మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ నటించిన ‘నారదన్’ సినిమా 2022 లో మలయాళంలో రిలీజయి మంచి హిట్ అయింది. ఆషిక్ అబూ దర్శకత్వంలో అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి.. పలువురు ముఖ్య పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో టోవినో ఓ టీవీ జర్నలిస్ట్ గా కనిపించదు. మళయాలంలో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నారదన్ సినిమా ఆహా ఓటీటీలో రేపు నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాలు భవాని మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.