×
Ad

Priyadarshi: గడ్డి పీకమంటావా.. నెటిజన్ తింగరి ప్రశ్నకి ప్రియదర్శి సాలిడ్ కౌంటర్..

కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రియదర్శి(Priyadarshi). బలగం సినిమాతో ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది.

Priyadarshi gives a mass counter to a netizen who asked crazy questions

Priyadarshi: కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రియదర్శి(Priyadarshi). బలగం సినిమాతో ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. అప్పటినుంచి మంచి మంచి పాత్రలతో సహా సోలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు ప్రియదర్శి. మంచి విజయాలు కూడా అందుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా చేస్తున్న సినిమా “ప్రేమంటే..”. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో జాంబీ రెడ్డి ఫేమ్ ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allari Naresh: “సుడిగాడు 2 “.. 1 టికెట్ పై 200 సినిమాలు.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన అల్లరి నరేష్

అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగానే నటుడు ప్రియదర్శి సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ముచ్చటించాడు. ఆస్క్ ప్రేమంటే యాష్ ట్యాగ్ తో నెటిజన్స్ అడిగిన చాలా ప్రశ్నలు సమాదాలను ఇచ్చాడు. అలాగే తిక్క తిక్క ప్రశ్నలు అడిగిన వారికి అంతే తిక్కగా మాస్ కౌంటర్లు ఇచ్చాడు ప్రియదర్శి. అందులో ఒక నెటిజన్ “ప్రియదర్శి అన్నా.. ఇక నువ్వు సినిమాలు చేయడం ఆపేయ్ అన్న ప్లీజ్” అంటూ అడిగాడు. దానికి ప్రియదర్శి స్పందిస్తూ “మానేసి ఎం చేయమంటావ్.. గడ్డి పీకలా”అంటూ మాస్ కౌంటర్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ నెటిజన్ “**లు పిసుక్కో అన్నా.. న్యూ ట్రెండ్” అంటూ మళ్ళీ కామెంట్స్ చేశాడు. దానికి “రేపు థియేటర్ కి రా తమ్ముడు.. గుండెల్ని పిండి పంపిస్తా” అంటూ కౌంటర్ ఇచ్చాడు”దీంతో ఆ నెటిజన్ మళ్ళీ కనబడలేదు. ఇక ప్రియదర్శి ఇచ్చిన కౌంటర్లకి చాలా మంది మద్దతు తెలిపారు.