రానా మూవీతో రీ ఎంట్రీ

ప్రస్తుతం టీవీ షోస్‌లో జడ్జ్‌గా కనిపిస్తున్నప్రియమణి, త్వరలో రానా నటించబోయే విరాటపర్వం 1992 సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది..

  • Publish Date - April 29, 2019 / 02:12 PM IST

ప్రస్తుతం టీవీ షోస్‌లో జడ్జ్‌గా కనిపిస్తున్నప్రియమణి, త్వరలో రానా నటించబోయే విరాటపర్వం 1992 సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది..

గతకొద్ది కాలంగా టాలీవుడ్‌లో ఒకప్పటి హీరోయిన్స్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.. స్నేహ, ఖుష్బూ, నదియా, రమ్యకృష్ణ, టబు, మధుబాల లాంటి వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తెలుగు తెరకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.  
Also Read : చివరి షెడ్యూల్‌లో అసురన్

ఆమె ఎవరో కాదు, యమదొంగ, హరేరామ్, పెళ్ళైన కొత్తలో, మిత్రుడు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. పెళ్ళి తర్వాత సినిమాలు చెయ్యడం మానేసిన ప్రియమణి, కొన్ని టీవీ షోస్‌లో జడ్జ్‌గా కనిపిస్తుంది. ఆమె త్వరలో రానా నటించబోయే విరాటపర్వం 1992 సినిమా ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.

నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చెయ్యనున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు ఇంపార్టెంట్ రోల్‌ చేస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రియమణి కూడా టబుతో కలిసి మానవ హక్కులపై పోరాడే క్యారెక్టర్ చెయ్యనుందని ఫిలింనగర్ టాక్. సాయి పల్లవి నక్సలైట్‌గా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.
Also Read : ఏబీసీడీ.. ‘మెల్ల మెల్లగా’ వీడియో సాంగ్..