Priyanka Chopra Citadel : వరల్డ్ టాప్ వెబ్ సిరీస్‌గా ప్రియాంక సిటాడెల్.. సమంత ఏమి చేస్తుందో?

ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ సిటాడెల్ వరల్డ్ టాప్ సిరీస్ ప్లేస్ ని కైవసం చేసుకుంది. మరి సమంత ఇండియన్ వెర్షన్ సిటాడెల్ ఎటువంటి..

Priyanka Chopra Citadel : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden) ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఈ సిటాడెల్ ఏప్రిల్ 28 నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ప్రస్తుతం 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం మిగిలిన ఎపిసోడ్స్ ని మే నెలలో విడుదల చేయనున్నారు.

Sobhita – Aishwarya : పొన్నియిన్ భామల లాస్ట్ డే ఫన్నీ మూమెంట్స్.. వీడియో వైరల్!

ఇక సిరీస్ పై ముందు నుంచే ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకోవడంతో సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. రిలీజ్ అయిన తరువాత మిక్స్‌డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ, ముందు నుంచి ఉన్న బజ్ ఈ సిరీస్ వరల్డ్ టాప్ సిరీస్ గా నిలిచింది. VOD (Video-On-Demand) ట్రాకింగ్ పోర్టల్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 29న ఎక్కువ వ్యూయర్ షిప్ సంపాదించి ఫస్ట్ ప్లేస్ ని సొంత చేసుకుంది. దీని తరువాత నెట్‌ఫ్లిక్స్ – స్వీట్ టూత్ (Sweet Tooth), ప్రైమ్ వీడియో – ది మార్వెలస్ మిస్ మైసెల్ (The Marvelous Mrs Maisel), నెట్‌ఫ్లిక్స్ – ది డిప్లొమాట్ (The Diplomat), ప్రైమ్ వీడియో – పవర్ స్టారింగ్ టోనీ కాలీట్ (Power starring Toni Collette) సిరీస్ లు తరవాతి స్థానంలో నిలిచాయి.

Ustaad Bhagat Singh : అరే సాంబ రాసుకోరా.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త అప్డేట్!

కాగా సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత (Samantha) నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రియాంక సిటాడెల్ వరల్డ్ టాప్ సిరీస్ ప్లేస్ ని కైవసం చేసుకోవడంతో సమంత సిటాడెల్ ఎటువంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో అని అందరి ఆసక్తిగా ఉన్నారు. ఇండియాలో ఈ సిరీస్ పై భారీ బజ్ నెలకుంది.

 

ట్రెండింగ్ వార్తలు