Sobhita – Aishwarya : పొన్నియిన్ భామల లాస్ట్ డే ఫన్నీ మూమెంట్స్.. వీడియో వైరల్!

పొన్నియిన్ లాస్ట్ డే షూట్ లో శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి చేసిన ఫన్నీ మూమెంట్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sobhita – Aishwarya : పొన్నియిన్ భామల లాస్ట్ డే ఫన్నీ మూమెంట్స్.. వీడియో వైరల్!

Sobhita Dhulipala Aishwarya Lekshmi BTS video at last day shoot of PS2

Sobhita – Aishwarya : తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). తమిళ నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమాని రెండు భాగాలుగా చిత్రకరించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా ఓకే అనిపించుకుంది. తాజాగా ఈ మూవీ సెకండ్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే రెండో భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకి థియేటర్ల వద్ద ప్రజాధారణ పెరుగుతుంది.

Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..

ఇక ఈ సినిమాలో విక్రమ్(Vikram), కార్తీ(Karthi), జయం రవి(Jayam Ravi), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), త్రిష(Trisha), శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి.. వంటి తరమణులు కలిసి నటించారు. రెండు పార్ట్ కూడా రిలీజ్ అయ్యిపోవడంతో యాక్టర్స్ అంతా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ.. పొన్నియిన్ లాస్ట్ డే షూటింగ్ లోని ఫన్నీ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. తన కో యాక్టర్ ఐశ్వర్య లక్ష్మితో కలిసి ఒక వీడియో చేసింది. ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేయగా వైరల్ అవుతుంది.

Salman Khan : తండ్రి కావాలనుకుంటున్నా.. పెళ్లి పై సల్మాన్ కామెంట్స్..

ఆ వీడియోలో ఇద్దరు భామలు కలిసి సరదాగా సందడి చేస్తూ ఫోటోలకు కేజ్రీగా పోజులు ఇచ్చారు. ఇక ఆ వీడియో ఇద్దరి భామల అందాలు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ సినిమా రెండో రోజే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని రికార్డు సృష్టించింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల వరకు రాబట్టింది. ఇప్పుడు PS2 స్పీడ్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ ని ఈజీగా ఓవర్ టేక్ చేసే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)