Salman Khan : తండ్రి కావాలనుకుంటున్నా.. పెళ్లి పై సల్మాన్ కామెంట్స్..

ఇప్పటి వరకు పెళ్లి, పిల్లలు గురించి మాట్లాడని సల్మాన్ తాజాగా తనకి తండ్రి కావాలని ఉందంటూ, అందుకోసం..

Salman Khan : తండ్రి కావాలనుకుంటున్నా.. పెళ్లి పై సల్మాన్ కామెంట్స్..

Salman Khan want to be father through Surrogacy

Updated On : April 30, 2023 / 3:06 PM IST

Salman Khan : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సల్మాన్ ఖాన్ అనే చెబుతారు అందరూ. 57 ఏళ్ళ వయసు సల్మాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే మిగిలిపోయాడు. బాలీవుడ్ లో పలువురితో ప్రేమ కథలు కూడా నడిపాడు సల్మాన్. ఒకప్పటి నటి జూహీ చావ్లాతో అయితే పెళ్లి వరకు వెళ్ళాడు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వచ్చాడు. జూహీ చావ్లాని (Juhi Chawla) ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, జూహీ తండ్రికి తెలియజేశాడు. కానీ అయన ఒప్పుకోకపోవడంతో అది అక్కడితో ముగిసిపోయిందని సల్మాన్ చెప్పుకొచ్చాడు.

Salman Khan : భాయ్ కి ఏమైంది? 100 కోట్లు రాబట్టడానికి కష్టపడుతున్నాడు..

ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో జూహీ చావ్లా కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు పెళ్లి గురించి మాట్లాడని సల్మాన్ పెళ్లి, పిల్లలు గురించి ప్రస్తావించాడు. తనకి తండ్రి కావాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తనకి పిల్లలు అంటే చాలా ఇష్టమని, పిల్లల్ని ఎక్కువుగా ప్రేమిస్తాను అంటూ వ్యాఖ్యానించాడు. తన సిస్టర్స్ అండ్ బ్రదర్ పిల్లలతో సల్మాన్ చాలా సన్నిహితంగా ఉంటాడు.

Tollywood : బాలీవుడ్ హీరోలను విలన్స్ గా మారుస్తున్న టాలీవుడ్..

పిల్లలు వస్తే తల్లి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ లా తను తండ్రి కావాలని ఉందని, కానీ భారతదేశంలో ఆ చట్టం అందుబాటులో లేదని చెప్పుకొచ్చాడు. కాగా కరణ్ సరోగసి (Surrogacy ) ద్వారా తండ్రి అయ్యిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సల్మాన్ చట్టానికి తగట్టు తన ఆశని ఎలా నెరవేర్చుకుంటాడో చూడాలి. ఇక సల్మాన్ రీసెంట్ గా కిసీకి భాయ్ కిసీకా జాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.