Ustaad Bhagat Singh : అరే సాంబ రాసుకోరా.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో కొత్త అప్డేట్ ఇచ్చారు. అరే సాంబ రాసుకోరా..

Ustaad Bhagat Singh : అరే సాంబ రాసుకోరా.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త అప్డేట్!

Pawan Kalyan Ustaad Bhagat Singh music sittings start devisri prasad

Updated On : April 30, 2023 / 5:31 PM IST

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం క్రేజ్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నాడు. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి. హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో పవన్, హరీష్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలోని పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ కి కిక్ ఇస్తే, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ కి పవన్ వేసిన మాస్ స్టెప్స్ థియేటర్ ల్లో మోత మోగించాయి.

Pawan Kalyan: వీరమల్లు కోసం మరోసారి ఆ ఫీట్ చేస్తున్న పవన్.. నిజమేనా..?

ఇప్పుడు ఉస్తాద్ కూడా హరీష్ శంకర్ దేవిశ్రీ నే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల ట్విట్టర్ ఇంటరాక్షన్ లో ఒక నెటిజెన్.. పవన్ తో మరోసారి మాస్ స్టెప్పులు వేయించు అన్న అని హరీష్ శంకర్ ని కోరగా, తప్పకుండా అంటూ బదులిచ్చాడు. దీంతో ఈ సినిమా సంగీతం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో పవన్ OG మూవీ షూటింగ్ లోకి షిఫ్ట్ అయ్యాడు.

Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్‌.. ఫోటో వైరల్!

సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి సమయం ఉండడంతో ఆ గ్యాప్ లో మూవీకి సంబంధించిన ఇతర వర్క్స్ పూర్తి చేస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ లోని సీన్స్ ఎడిటింగ్ పనులు కూడా మొదలు పెట్టారు. తాజాగా మూవీలోని పాటలను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.