×
Ad

Priyanka Chopra : రాజమౌళి కొడుకుతో ప్రియాంక చోప్రా డ్యాన్స్.. వీడియో వైరల్..

మహేష్, మహేష్ ఫ్యామిలీ, రాజమౌళి, రాజమౌళి ఫ్యామిలీతో ప్రియాంక కు మంచి అనుబంధం ఏర్పడింది. (Priyanka Chopra)

Priyanka Chopra

Priyanka Chopra : బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన ప్రియాంక చోప్రా అక్కడే సినిమాలు చేస్తుంది. కానీ సడెన్ గా రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఒప్పుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాను హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తుండటం, రాజమౌళి సినిమా కావడం, రెమ్యునరేషన్ కూడా భారీగా ఇవ్వడంతో ప్రియాంక ఈ సినిమా ఒప్పుకుంది.(Priyanka Chopra)

ప్రియాంక ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర్నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకపోయినా ఈ సినిమా షూట్ కి వెళ్లిన ప్రతిసారి అక్కడ లొకేషన్స్ లో ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంది. ఇటీవల వారణాసి సినిమా ఈవెంట్లో కూడా ప్రియాంక హాజరయి సందడి చేసింది. మహేష్, మహేష్ ఫ్యామిలీ, రాజమౌళి, రాజమౌళి ఫ్యామిలీతో ప్రియాంక కు మంచి అనుబంధం ఏర్పడింది.

Also Read : Hema : ఆ బాధతోనే మా అమ్మ చనిపోయింది.. డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ హేమ ఎమోషనల్..

తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పెషల్ పోస్టులు పెట్టింది. కార్తికేయతో దిగిన ఫోటోని షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే కార్తికేయతో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియోని కూడా పోస్ట్ చేసింది ప్రియాంక. ఈ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేస్తూ.. టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్. సైలెంట్ గా అన్ని పనులు చేసే వ్యక్తి హ్యాపీ బర్త్ డే కార్తికేయ. ఈ సినిమా సమయంలో నీతో డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉంది అని రాసుకొచ్చింది.

రాజమౌళి కొడుకు బర్త్ డేకి ఇలా తనతో డ్యాన్స్ చేసిన స్పెషల్ వీడియో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. రాజమౌళి కొడుకు కార్తికేయ వారణాసి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే ప్రమోషన్స్ అన్ని చూసుకుంటున్నాడు. ప్రియాంక చోప్రా షేర్ చేసిన డ్యాన్స్ వీడియో మీరు కూడా చూసేయండి..

Also See : Kushitha Kallapu : చీరకట్టులో యువతను కలవరపెడుతున్న కుషిత.. ఫోటోలు వైరల్..