పీసీ అందం తగ్గలేదు-కుర్రాళ్ళకి నిద్రలేదు

పాపులర్ హాలీవుడ్ కమెడియన్ జిమ్మీ ఫాలెన్ నిర్వహించే, ది టు నైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలెన్ షోలో ప్రియాంక అందాల ఆరబోత.

  • Publish Date - February 7, 2019 / 08:07 AM IST

పాపులర్ హాలీవుడ్ కమెడియన్ జిమ్మీ ఫాలెన్ నిర్వహించే, ది టు నైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలెన్ షోలో ప్రియాంక అందాల ఆరబోత.

ప్రియాంక చోప్రా.. 36 ఏళ్ళ ఏజ్‌లోనూ హాట్ హాట్‌గా అందాలు ప్రదర్శిస్తూ, ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. గతేడాది మ్యుజిషియన్ నిక్ జోనాస్‌ని మనువాడిన ప్రియాంక, ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చెయ్యకపోయినా, హాలీవుడ్‌లో నటిస్తుంది. క్వాంటికో సిరీస్‌లో ప్రియాంక అందాల ఆరబోతకి హాలీవుడ్ బాబులు కూడా ఫిదా అయిపోయారు. అమెరికాలో రీసెంట్‌గా ఒక టీవీ షోలో పాల్గొంది ప్రియాంక. ఈ షోకి పీసీ రావడం ఇది అయిదవ సారి.ఆ షోకి ఆమె వేసుకొచ్చిన డ్రెస్, ఆ డ్రెస్‌లో ఉన్న పీసీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే, దాన్ని ప్రియాంక వేసుకోవడమే.

పాపులర్ హాలీవుడ్ కమెడియన్ జిమ్మీ ఫాలెన్ నిర్వహించే, ది టు నైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలెన్ షోకి ప్రియాంక వెళ్ళింది. సదరు షోలో ప్రియాంక మిలమిల మెరిసే డ్రెస్‌లో, హాట్ లుక్‌తో అదరగొట్టేసింది. మధ్య మధ్యలో డ్రెస్‌ని అదేపనిగా సరిచేసుకోవడంతో, అంత ఇబ్బందిగా ఉంటే, ఆ డ్రెస్సే వేసుకోవడం ఎందుకంటూ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ, బ్యూటిఫుల్ స్మైల్‌తో అలరించింది. ఈ ఫోటోలు చూసి కుర్రకారు గుటకలు మింగుతున్నారు. బ్రాలెస్ పిక్స్‌తో మతిపోగొడుతున్నావ్ పీసీ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ షోలో, నిక్‌తో తన ప్రేమాయణం నుండి పెళ్ళి వరకు జరిగిన పలు విషయాలు చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.. ఇంకెందుకాలస్యం, ఆ వీడియోని చూసి తరించండి మరి.

 

ట్రెండింగ్ వార్తలు